Kaiva OTT: ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సూపర్‌ హిట్‌ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే?

వివిధ భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన సినిమాలు, వెబ్‌ సిరీస్ లు ఓటీటీలో కూడా సందడి చేస్తున్నాయి. ప్రతివారం కొత్త సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్‌ కు వస్తుంటాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ వెర్షన్లను కూడా అందుబాటులోకి తెస్తుంటారు

Kaiva OTT: ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సూపర్‌ హిట్‌ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే?
Kaiva Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 04, 2024 | 7:55 PM

వివిధ భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన సినిమాలు, వెబ్‌ సిరీస్ లు ఓటీటీలో కూడా సందడి చేస్తున్నాయి. ప్రతివారం కొత్త సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్‌ కు వస్తుంటాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ వెర్షన్లను కూడా అందుబాటులోకి తెస్తుంటారు. అలా ఈ వారం కూడా ఒక కన్నడ సూపర్‌ హిట్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే కైవా. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ధన్‍వీర్, మేఘా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. కంటెంట్‌ బాగుండడంతో కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్ కూడా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్‌ 8 వ తేదీన థియేటర్లలో విడదులైన కైవా సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ ప్రేమకథా చిత్రం డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కైవా సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేసింది. తాజాగా ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతోంది. త్వరలోనే తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులోకి రానుందని సమాచారం. అయితే ప్రస్తుతం కన్నడ వెర్షన్‌కు ఇంగ్లిష్ సబ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. కాబట్టి చూడాలనుకునేవారు ఈ సినిమాను చూసేయవచ్చు.

కైవా సినిమాకు జయతీర్థ జయన్న దర్శకత్వం వహించారు. దినకర్ తోగుదీప, రమేశ్ ఇందిర, జయరామ్ కార్తీక్, నందా, రఘు, ఉగ్రం మంజు, జాన్వీ రాయల ప్రధాన పాత్రలు పోషించారు. కాంతార, విరూపాక్ష, మంగళవారం సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన అజ్నీశ్ లోకనాథ్ ఈమూవీకి సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఒక యదార్థ ఘటన ఆధారంగా కైవా చిత్రాన్ని తెరకెక్కించారు జయతీర్థ. ఉద్యోగం కోసంబెంగళూరుకు వచ్చిన కైవా (ధనవీర), ముస్లిం అమ్మాయి సల్మా (మేఘా శెట్టి)తో ప్రేమలో పడతాడు. సల్మా కూడా ప్రేమించుకుంటారు. అయితే గ్యాంగ్‍స్టర్ లవర్‌ అనుకుని సల్మాను ముగ్గురు రౌడీలు వేధిస్తారు. యాసిడ్‍తో దాడి కూడా చేస్తారు. దీంతో గోవిందన్న సాయంతో ఆ ముగ్గురిపై రివేంజ్‌ తీర్చుకోవాలనుకుంటాడు కైవా. సల్మాను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెపై యాసిడ్‌ తో దాడి చేసిన ఇద్దరిని చంపేసి జైలుకు వెళతాడు. మరి కైవా బయటకు వచ్చాడా? సల్మా జీవితం ఎలా మారిపోయిందో తెలుసుకోవాలంటే కైవా సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..