Tamannah: అభిమానులకు షాకిచ్చిన తమన్నా.. విజయ్ వర్మతో బ్రేకప్ రూమర్స్ మధ్య ఇలా..
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా పేరు ఈ మధ్య వార్తలలో తెగ నిలుస్తుంది. సినిమాల గురించి కాకుండా నిత్యం వ్యక్తిగత విషయాలతోనే నెట్టింట ఆమె పేరు చర్చకు దారి తీస్తుంది. తాజాగా మరోసారి తమన్నా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతుంది. అంతేకాదు.. ఆమె ఫోటోస్ సైతం తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. అసలేం జరిగిందంటే..

బాలీవుడ్ లవ్ బర్డ్స్ తమన్నా, విజయ్ వర్మ పర్సనల్ విషయాల గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు విడిపోయారంటూ ప్రచారం నడుస్తుంది. ఇక కొన్ని రోజులుగా వీరిద్దరు విడివిడగగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటీవల హోలీ సందర్భంగా బీటౌన్ లో జరిగిన పార్టీలోనూ ఇద్దరు విడివిడిగా వచ్చి వెళ్లారు. దీంతో వీరు విడిపోయారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ క్రమంలోనే తాజాగా తమన్నాకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో తమన్నా ధరించిన డ్రెస్ గురించి ఇప్పుడు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
తమన్నా భాటియా రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. ఈసారి ఆమె లుక్ చాలా గ్లామరస్ గా ఉంది. ఇందులో తమన్నా ధరించిన జాకెట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇది విజయ్ జాకెట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మార్చి 16న జరిగిన రాషా తడాని పుట్టినరోజు వేడుకలో తమన్నా అద్భుతమైన నల్లటి బాడీకాన్ గౌనులో కనిపించింది. దానిపై నలుపు, తెలుపు చారలతో ఉన్న బ్లేజర్ ధరించింది. అయితే అంతకు ముందు తమన్నాతో కలిసి చేసిన ఫోటోషూట్ లో విజయ్ సైతం ఇలాంటి బ్లేజర్ ధరించాడు. బ్రేకప్ పుకార్ల మధ్య తమన్నా ప్రత్యేక పోస్ట్ తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది
“ఒక అద్భుతం జరిగే వరకు వేచి ఉండకండి, దానిని సాధ్యం చేయండి!” అంటూ రాసుకొచ్చింది. దీంతో తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ రూమర్స్ మధ్య ఈ పోస్ట్ నెట్టింట వైరలయ్యింది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపించిన సమాచారం ప్రకారం.. తమన్నా వెంటనే పెళ్లి చేసుకోవాలని భావిస్తుండగా.. విజయ్ మాత్రం ఇంకా సమయం కావాలని అడిగాడని.. దీంతో ఇద్దరు విడిపోయారని టాక్ నడిచింది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇద్దరు స్పందించలేదు. తమన్నా, విజయ్ 2022 లో డేటింగ్ ప్రారంభించారు. ఇద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2లో కనిపించారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..