Sye Raa: పవర్‌స్టార్ వాయిస్‌తో ‘సైరా’ ట్రైలర్..!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మరో గంటలో మేకింగ్ వీడియో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ నెల 22న చిరు పుట్టినరోజు నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. దానికి చిరు […]

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మరో గంటలో మేకింగ్ వీడియో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ నెల 22న చిరు పుట్టినరోజు నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. దానికి చిరు సోదరుడు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ట్రైలర్‌కు అదనపు ఆకర్షణ అవ్వడంతో పాటు మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అవుతుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
కాగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రానున్న ఈ మూవీలో పలు ఇండస్ట్రీలకు చెందిన భారీ తారాగణం నటించింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, రవి కిషన్, నయనతార, తమన్నా వంటి స్టార్ నటీ నటులు ఈ సినిమాలో భాగం అయ్యారు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించాడు. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.



