కరోనా ఎఫెక్ట్ః హృతిక్ ఇంటికి చేరుకున్న మాజీ భార్య..!
చైనాలో పుట్టిన కరోనా ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురి చేయిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 21వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది యుద్ధం చేస్తున్నారు.

చైనాలో పుట్టిన కరోనా ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురి చేయిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 21వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది యుద్ధం చేస్తున్నారు. అయితే ఈ వైరస్ వలన కాస్త మంచి కూడా జరుగుతోంది. ఇప్పటికే పలు దేశాల్లోని ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో.. జంతు జాతులు స్వేచ్ఛగా రోడ్ల మీదికి వస్తున్నాయి. కాలుష్యం తగ్గిపోయింది. అంతేకాదు వృత్తి రీత్యా వేరు వేరు ప్రదేశాల్లో కాలం గడుపుతున్న ఎంతో మంది సొంత ఇంటికి చేరుకొని.. సొంత వారికి తమ సమాయాన్ని కేటాయిస్తున్నారు. ఇక భారత్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. కాగా ఇప్పుడు కరోనా నేపథ్యంలో తన మాజీ భర్త ఇంటికి చేరుకున్నారు సుశాన్నే ఖాన్.
2000లో వివాహం చేసుకున్న హృతిక్ రోషన్, సుశాన్నే.. 2014లో విడిపోయారు. కానీ తమ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తూ.. తల్లీదండ్రుల బాధ్యతలను నెరవేరుస్తుంటారు. ఈ క్రమంలో వారిద్దరు కలిసి పిల్లలను విదేశాలకు తీసుకెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా కరోనా నేపథ్యంలో ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన పలువురు సెలబ్రిటీలు క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హృతిక్, సుశాన్నేల పిల్లలు హ్రేహాన్, హ్రీదాన్‌లు క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక వారిని చూసుకునేందుకు హృతిక్ నివాసముంటోన్న జుహు రెసిడెంట్‌కు వెళ్లారు సుశాన్నే. ఈ విషయాన్ని హృతిక్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆమె రాక తమకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని.. పిల్లల గురించి తల్లిదండ్రులుగా తామిద్దరం ఎప్పుడు బాధ్యతలను మరవమని హృతిక్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో మోదీ లాక్‌డౌన్‌ను ప్రకటించగా.. అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఎప్పుడూ బిజీగా సినీ సెలబ్రిటీలకు తమ కుటుంబంతో గడిపే సమయం దొరికినట్లైంది.
Read This Story Also: ‘కరోనా’ గురించి మరో షాకింగ్ న్యూస్.. !
https://www.instagram.com/p/B-JlJZvH0bC/?utm_source=ig_embed



