AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్‌ మృతి కేసు.. స్టార్‌ దర్శకుడిని ప్రశ్నించనున్న పోలీసులు..!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణను వేగవంతం చేశారు ముంబయి పోలీసులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 28 మందిని ప్రశ్నించిన పోలీసులు.. వారి నుంచి పలు కీలక విషయాలను సేకరించారు.

సుశాంత్‌ మృతి కేసు.. స్టార్‌ దర్శకుడిని ప్రశ్నించనున్న పోలీసులు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 02, 2020 | 8:42 AM

Share

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణను వేగవంతం చేశారు ముంబయి పోలీసులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 28 మందిని ప్రశ్నించిన పోలీసులు.. వారి నుంచి పలు కీలక విషయాలను సేకరించారు. కాగా ఈ కేసులో స్టార్ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ను పోలీసులు విచారించబోతున్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌తో శేఖర్‌ కపూర్‌ ‘పానీ’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. యశ్‌రాజ్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. అయితే కొన్ని కారణాల వలన యశ్‌రాజ్‌ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో.. శేఖర్‌ కపూర్‌నే ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించాలనుకున్నారు. కానీ ఆ లోపే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు.

కాగా సుశాంత్ మృతి సమయంలో శేఖర్‌ కపూర్‌ వేసిన ఓ ట్వీట్ అప్పట్లో సంచలనంగా మారింది. ”నీ జీవితంలో నువ్వు ఎంత బాధ పడుతున్నావో నాకు తెలుసు. నిన్ను చెడ్డవాడిగా చిత్రీకరించి, కిందికి లాగాలని ప్రయత్నించిన వారి కథలు నాకు తెలుసు. వారి వలన నా భుజంపై ముఖం వాల్చి నువ్వు ఏడ్చావు. ఆరు నెలలుగా నేను నీతో ఉండాల్సింది. నువ్వు కూడా నా దగ్గరకు రావాల్సింది. ఏం జరిగినా అది వారి కర్మ. నీది కాదు” అని శేఖర్‌ కపూర్‌ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సుశాంత్‌ ఏ విషయంలో బాధపడ్డారన్న విషయంపై శేఖర్ కపూర్‌ను విచారించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు పంపనున్నట్లు సమాచారం.

Follow Us
పిల్లల చేతిలో ఎప్పుడూ ఫోన్ ఉంటోందా?.. సైకియాట్రిస్ట్‌ చెప్తోందిదే
పిల్లల చేతిలో ఎప్పుడూ ఫోన్ ఉంటోందా?.. సైకియాట్రిస్ట్‌ చెప్తోందిదే
బ్రేక్ ఫాస్ట్ తయారీ ఇక చిటికెలో.. ఒకే మెషీన్‌లో అన్నీ..
బ్రేక్ ఫాస్ట్ తయారీ ఇక చిటికెలో.. ఒకే మెషీన్‌లో అన్నీ..
ఎయిర్ ఫ్రైయర్లో ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు!
ఎయిర్ ఫ్రైయర్లో ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు!
ఫ్రిజ్ ఎందుకు పేలుతుందో తెలుసా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి
ఫ్రిజ్ ఎందుకు పేలుతుందో తెలుసా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి
ఈ అమ్మాయిల నుంచి మీకు ఫోన్ వచ్చిందా.. ఇది మామూలు కథ కాదు..
ఈ అమ్మాయిల నుంచి మీకు ఫోన్ వచ్చిందా.. ఇది మామూలు కథ కాదు..
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం
ఫోల్డబుల్ ఫోన్ ప్రియులకు బిగ్ సర్‌‌ప్రైజ్‌
ఫోల్డబుల్ ఫోన్ ప్రియులకు బిగ్ సర్‌‌ప్రైజ్‌
జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ రిస్క్ తప్పదు!
జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ రిస్క్ తప్పదు!
ఈ టాలీవుడ్ డైరెక్టర్‌కు ఆకలి విలువ బాగా తెలుసు.. తన ఆఫీసులోనే...
ఈ టాలీవుడ్ డైరెక్టర్‌కు ఆకలి విలువ బాగా తెలుసు.. తన ఆఫీసులోనే...
కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! వీడియో వైరల్
కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! వీడియో వైరల్