AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ కొత్త పోస్టర్ రిలీజ్..

యంగ్ హీరో సుశాంత్ 'అల.. వైకుంఠ‌పుర‌ములో' చిత్రంలో చేసిన పాత్ర‌తో ఇటు విమ‌ర్శ‌కుల‌, అటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. దాని త‌ర్వాత ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు'.

'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' కొత్త పోస్టర్ రిలీజ్..
Ravi Kiran
|

Updated on: Sep 20, 2020 | 9:59 PM

Share

యంగ్ హీరో సుశాంత్ ‘అల.. వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంలో చేసిన పాత్ర‌తో ఇటు విమ‌ర్శ‌కుల‌, అటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. దాని త‌ర్వాత ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌. ద‌ర్శ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఏ1 స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్ల‌పై ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల నిర్మిస్తున్నారు. ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్‌.

సెప్టెంబ‌ర్ 20 ఆదివారం న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతి సంద‌ర్భంగా ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’లోని సుశాంత్ కొత్త పోస్ట‌ర్‌ను చిత్రం బృందం విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో సుశాంత్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్‌పై కూర్చొని స్టార్ట్ చెయ్య‌డంతో రోడ్డుపై ఉన్న నీళ్లు చింది పైకి లేచాయి. అందుకు త‌గ్గ‌ట్లు ఒక చేత్తో హ్యాండిల్ ప‌ట్టుకొని, మ‌రొక చేతిని పైకిలేపి, సంతోషాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్న‌ట్లుగా క‌నిపిస్తున్నారు సుశాంత్‌. పోస్ట‌ర్‌పై “గేర్ మార్చి బండి తియ్!!!” అనే అక్ష‌రాలు క‌నిపిస్తున్నాయి. అవి హీరో ఎలాంటి సెల‌బ్రేష‌న్ మోడ్‌లో ఉన్నాడో తెలియ‌జేస్తున్నాయి. (Sushant New Movie)

వ‌చ్చే వారం ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వారు త‌మ అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో “లెజెండ్‌ ఏఎన్నార్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను గుర్తు చేసుకుంటూ త్వ‌ర‌లో ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ షూటింగ్” అంటూ ట్వీట్ చేశారు. “ఏఎన్నార్ లివ్స్ ఆన్” అనే హ్యాష్‌ట్యాగ్‌ను దానికి జోడించారు. ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్‌కు సైతం మంచి రెస్పాన్స్ వ‌స్తోంద‌ని చిత్ర బృందం తెలిపింది. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ఎం. సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి