Suryakantham: సూర్యకాంతం చనిపోతే ఎవరూ వెళ్లలేదు.. ఫోన్ చేసి ఓదార్చిన ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలు..
సూర్యకాంతం చనిపోయినప్పుడు చిత్రసీమ నుంచి ఎవరూ నేరుగా రాలేకపోయినా, ఆ ఇద్దరు టాలీవుడ్ అగ్ర హీరోలు ఫోన్ చేసి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలను కొనియాడుతూ, ఆమె పట్ల తమకున్న అపారమైన గౌరవాన్ని, ఆప్యాయతను ఆ ఫోన్ కాల్ ద్వారా వ్యక్తం చేస్తూ పరామర్శించారు.

తెలుగు చిత్రసీమలో తమదైన నటనతో చెరగని ముద్ర వేసిన మహానటులు అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు. వెండితెరపై ఎంతటి పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ,తోటి నటీనటుల పట్ల వారు చూపించే ఆప్యాయత, గౌరవం ఎల్లప్పుడూ ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా నాటి తరం నటీనటుల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ, సీనియర్ నటి సూర్యకాంతం కుమారుడు పద్మనాభ మూర్తి ఇటీవల ఇచ్చి ఇంటర్వ్యూలో పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..
సూర్యకాంతం గారు కన్నుమూసిన సమయంలో అప్పటి ప్రముఖ నటీనటులు, సినీ పెద్దలు చూపించిన ఆప్యాయత ఎనలేనిదని పద్మనాభ మూర్తి గుర్తుచేసుకున్నారు. అమ్మగారు మరణించిన విషయం తెలిసిన వెంటనే అక్కినేని నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి పరామర్శించారు అని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ, సూర్యకాంతం గారితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, సినీ రంగంలో ఆమె చూపించిన క్రమశిక్షణ , నటనను గురించి చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‌తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..
అదే సమయంలో, ఎన్టీఆర్ గారు నేరుగా రావడం కుదరకపోవడంతో ఫోన్ కాల్ చేసి పరామర్శించారని గుర్తు చేసుకున్నారు. ఆ ఫోన్ కాల్ వెనుక ఉన్న ఆవేదన , గౌరవం ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ మాట్లాడిన తీరు, సూర్యకాంతం గారి పట్ల ఆయనకు ఉన్న అపారమైన గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. నాటి సినీ పరిశ్రమలో నటీనటులు కేవలం వృత్తిపరంగానే కాక, ఒకే కుటుంబంలా మెలిగేవారని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..
