AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు మరో అదిరిపోయే ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 19కిపైగా ఓటీటీలు ఫ్రీ..

ఎయిర్‌టెల్ మరో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. అదే రూ.200 ఓటీటీ ఫ్లాన్. ఈ ప్లాన్ ద్వారా 20కిపైగా ఓటీపీ ఫ్లాట్‌ఫామ్స్ ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. అలాగే 30జీబీ డేటా లభిస్తుంది. అంతేకాదు మీరు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుందని చెప్పవచ్చు.

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు మరో అదిరిపోయే ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 19కిపైగా ఓటీటీలు ఫ్రీ..
Airtel
Venkatrao Lella
|

Updated on: Oct 23, 2026 | 9:22 PM

Share

ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఈ కంపెనీ బంపర్ ఆఫర్ తమ యూజర్ల కోసం తీసుకొచ్చింది. కేవలం రూ.200లతో ఓటీపీ టాప్ అప్ రీచార్జ్ ప్యాక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.200తో రీఛార్జ్ చేసుకుంటే చాలు అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5 ప్రీమియం, మరియు సోనీలివ్‌తో పాటు 19కిపైగా OTT ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే 28 రోజుల పాటు అదనంగా 30 జీబీ డేటా పొందవచ్చు. దీంతో పాటు అదనంగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.

వ్యాలిడిటీ ఎన్ని రోజులంటే..

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. ఈ 28 రోజులు 30 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు 5జీ డేటా యాక్సెస్ పొందవచ్చు. 5జీ నెట్ వర్క్ ఏరియాలో 5జీ డేటా సేవలు పొందవచ్చు. ఈ ప్యాక్‌లో ఉచిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉండవు. కేవలం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తక్కువ ధరలో పొందాలనుకునేవారికి ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. అమెజాన్ ప్రైమ్, జియో హాట్ స్టార్, జీ5, ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం, సోనీ లైవ్, ఆహా ప్రీమియం, సన్ నెక్ట్స్ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను యాక్సెస్ చేయవచ్చు.

ఎలా రీఛార్జ్ చేసుకోవాలంటే..

యాడ్ అన్ ప్లాన్‌గా ఇది బాగా ఉపయోగపడుతుంది. 30జీబీ డేటా కోటాకు మించితే ప్రతీ ఎంబీకి 50 పైసల చొప్పున ఛార్జీ విధిస్తారు. ఎయిర్ థ్యాంక్స్ యాప్, ఎయిర్ టెల్ వెబ్ సైట్, ఇత డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ ప్యాక్ రీఛార్జ్ చేసుకోవచ్చు. 5జీ డేటా, వినోద ప్రయోజనాల కోసం ఈ రీఛార్జ్ ప్యాక్‌ను ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. అదనపు డేటా, ప్రీమియం ఓటీటీ కంటెంట్‌ను ఈ ప్యాక్ ధర లభిస్తుంది. చాలామంది ఇటీవల ఓటీపీ ఫ్లాట్‌ఫామ్స్ ఉపయోగిస్తున్నారు. ఒక్కొ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సబ్‌స్క్రీప్షన్ ప్రత్యేకంగా తీసుకోవాలంటే నెలకు రూ.200 వరకు అవుతుంది. మీరు నాలుగు ఓటీపీ ఫ్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిన్షన్ తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అయితే ఈ ప్యాక్ ధర కేవలం రూ.200తో అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ యాక్సెస్ చేయవచ్చు. దీని వల్ల మీ డబ్బులు ఆదా అవుతాయని చెప్పవచ్చు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఎక్కువగా ఉపయోగించేవారిని దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ ప్రవేశపెట్టింది.

Follow Us