పెద్ద మనసు చాటుకున్న సూర్య ఫ్యామిలి…కోవిడ్‌పై పోరాటానికి రూ.కోటి విరాళం..

Surya Family: తమిళ హీరో సూర్య ఫ్యామిలీ మరోసారి పెద్ద మనస్సు చాటుకుంది. కోవిడ్‌పై పోరాటానికి తమిళనాడు ప్రభుత్వానికి రూ. కోటి విరాళం అంజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాన నిధి రూ.కోటి చెక్కును అందజేశారు.

పెద్ద మనసు చాటుకున్న సూర్య ఫ్యామిలి...కోవిడ్‌పై పోరాటానికి రూ.కోటి విరాళం..
Surya
Follow us
Janardhan Veluru

| Edited By: Team Veegam

Updated on: May 12, 2021 | 11:12 PM

తమిళ హీరో సూర్య ఫ్యామిలీ మరోసారి పెద్ద మనస్సు చాటుకుంది. కోవిడ్‌పై పోరాటానికి తమిళనాడు ప్రభుత్వానికి రూ. కోటి విరాళం అంజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాన నిధి రూ.కోటి చెక్కును అందజేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ తమిళనాడులో విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా…కోవిడ్ మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై ప్రభుత్వం చేపడుతున్న పోరాటానికి అందరూ అండగా నిలవాలని, వీలైనంత మేరకు సీఎం సహాయనిధికి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Surya Family

Surya Family

ఈ నేపథ్యంలో సూర్య తండ్రి శివకుమార్ తమ కుటుంబం తరఫున రూ.కోటి విరాళం ప్రకటించారు. శివకుమార్, సూర్య, కార్తి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను స్వయంగా కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. కోవిడ్‌పై తమిళనాడు ప్రభుత్వం చేపడుతున్న పోరాటానికి అండగా నిలిచేందుకు ఈ సాయాన్ని అందజేసినట్లు తెలిపారు.కరోనా బారినుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. హీరో సూర్య కుటుంబం క‌రోనాపై పోరుకు త‌మ మ‌ద్ద‌తుని తెలియ‌జేస్తూ ఇంత భారీ విరాళాన్ని ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ వారిని అభినందిస్తున్నారు.

అటు కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని పిలుపునిస్తూ హీరో కార్తి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.