కడుపుబ్బా నవ్విస్తోన్న ‘తెనాలి రామకృష్ణ’

హీరో సందీప్ కిషన్.. ఏ సినిమా చేసినా.. కాస్త విచిత్రమైన కథలను ఎంచుకుంటూంటాడు. అందులో సక్సెస్ కూడా అవుతాడు. తాజాగా.. సందీప్.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.. అదే ‘తెనాలి రామకృష్ణ’ బీఏ.బిల్. ఈ సినిమాలో.. హన్సిక.. సందీప్‌తో జోడి కట్టింది. దాదాపు చాలా సినిమాల తర్వాత హన్సిక ఈ సినిమాలో కనిపించింది. అలాగే.. వరలక్ష్మీ శరత్ కుమార్.. కీలక రోల్‌లో నటించారు. ఈ సినిమాకి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఎక్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్‌గా […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:03 pm, Sun, 15 September 19
కడుపుబ్బా నవ్విస్తోన్న 'తెనాలి రామకృష్ణ'

హీరో సందీప్ కిషన్.. ఏ సినిమా చేసినా.. కాస్త విచిత్రమైన కథలను ఎంచుకుంటూంటాడు. అందులో సక్సెస్ కూడా అవుతాడు. తాజాగా.. సందీప్.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.. అదే ‘తెనాలి రామకృష్ణ’ బీఏ.బిల్. ఈ సినిమాలో.. హన్సిక.. సందీప్‌తో జోడి కట్టింది. దాదాపు చాలా సినిమాల తర్వాత హన్సిక ఈ సినిమాలో కనిపించింది. అలాగే.. వరలక్ష్మీ శరత్ కుమార్.. కీలక రోల్‌లో నటించారు. ఈ సినిమాకి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఎక్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్‌గా సీతారామరాజు వ్యవహరించారు.

కాగా.. ఈ సినిమా టీజర్.. తాజాగా విడుదలైంది. ఈ టీజర్‌లో సందీప్ కిషన్.. లాయర్ పాత్రలో చేస్తున్నాడు. కేసులు రావడం కోసం ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. ఒక కేసు వాదిస్తే.. మరో కేస్ ఫ్రీ అని, పేటీఎం చేస్తే.. 50 పర్సెంట్ క్యాష్ బ్యాక్ అని, కేసు పూర్తిగా ఓడిపోతే.. 100 శాతం క్యాష్ బ్యాక్ అంటూ బంపర్‌ ఆఫర్లు ఇస్తూ.. టీజర్‌లో అదరగొట్టాడు. హన్సిక కూడా అదే పాత్రలో నటిస్తుంది. కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్.. పొలిటీషన్‌‌గా నటిస్తున్నారు. అయితే.. టీజర్‌లో మొదటి నుంచీ.. చివరి వరకూ.. నవ్వుల సందడి కనిపిస్తోంది. అక్కడక్కడ కాస్త సీరియస్‌నెస్ కనిపించినా.. మొత్తానికి కడుపుబ్బా నవ్వించడంలో.. మాత్రం గ్యారెంటీ అనే చెప్పవచ్చు. కాగా.. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.