Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Pawan Kalyan: పవన్- హరీష్ సినిమా అప్‏డెట్.. ఆ మూవీ కోసం పనిచేయనున్న స్టార్ టెక్నీషియన్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. తర్వాత పవన్, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

Hero Pawan Kalyan: పవన్- హరీష్ సినిమా అప్‏డెట్.. ఆ మూవీ కోసం పనిచేయనున్న స్టార్ టెక్నీషియన్ ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2021 | 3:03 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. తర్వాత పవన్, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ కూడా కంప్లీట్ చేసి స్క్రిప్ట్ పూర్తిచేసే పనిలో ఉన్నాడు దర్శకుడు హరీష్. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్‏డెట్ రాలేదు. ఇక పవన్ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుండడంతో అభిమానులు అంచనాలు భారీగానే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‏లో రాబోతున్న రెండో సినిమా ఇది. గబ్బర్ సింగ్ మూవీ తర్వాత హరీష్, పవన్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ అందిస్తాడా అనుకుంటున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పవన్, హరీష్ సినిమాకు ఫేమస్ సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ పనిచేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ హరీష్‏తో కలిసి బోస్.. దువ్వాడ జగన్నాధం, గద్దల కొండ గణేశ్ సినిమాలు చేసాడు. ఇక పవన్ సినిమా కోసం కూడా బోస్‏నే తీసుకోవాలని హరీష్ భావిస్తున్నాడట. ఇక ప్రస్తుతం పవన్ అయ్యప్పన్ కోషియం రీమేక్ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు.

Also Read: Power Star Pawan Kalyan : పవర్ స్టార్ మూవీ‌‌‌‌‌‌లో మహేష్ బాబు హీరోయిన్.. కియారా అద్వానీని ఫైనల్ చేసిన హరీష్ శంకర్.?

Pawan kalyan-Harish Shankar Movie : ఈ సారి పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ అలా చూపించబోతున్నాడట..!