Sreeja Konidela: వైరల్‌గా మారిన చిరంజీవి కూతురు పోస్ట్.. ఎదుటి వారికి ఏది ఇస్తే అదే వస్తుందంటూ..
Sreeja Konidela: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ కొణిదెల గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. శ్రీజ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రొఫైల్ నేమ్ మార్చడంతో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. శ్రీజ విడాకులు తీసుకోనుందా అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది...
Sreeja Konidela: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ కొణిదెల గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. శ్రీజ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రొఫైల్ నేమ్ మార్చడంతో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. శ్రీజ విడాకులు తీసుకోనుందా అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అటు శ్రీజ కానీ, కళ్యాణ్ దేవ్ కానీ ఈ విషయంపై స్పందించలేదు. దీంతో ఇవన్నీ పుకార్లేనని వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ వార్తలు వచ్చిన తర్వాతి నుంచి శ్రీజ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన ఓ పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘మనం ఎదుటి వ్యక్తికి మనస్పూర్తిగా ఏదైతే ఇస్తామో.. అదే 100రెట్లు మనకు తిరిగి వస్తుంది’అనే కొటేషన్‌ను షేర్ చేసింది శ్రీజ. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. స్టోరీస్‌లో పోస్ట్ చేసిన కొటేషన్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంతకీ శ్రీజ ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా శ్రీజ విషయంలో జరుగుతోన్న పుకార్లకు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.
Also Read: AP Employees: ఏపీ సచివాలయ ఉద్యోగులకు కొత్త తలనొప్పి.. మూడు సార్లు అటెండెన్స్
Prabhas: ఆ హీరోలతో పోటీపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు ఏమన్నాడంటే.!
Andhra Pradesh: తిరుపతిలో మరణ మృదంగం.. ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలు..