Chiranjeevi : ఆంజనేయుడు పై ప్రేమను చాటుకున్న రామ్ చరణ్.. వీడియో షేర్ చేసిన చిరు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మెగా ఫ్యామిలీ లో తనకంటూ భారీ ఫ్యాన్స్ బేస్ ను క్రియేట్ చేసుకొని తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్నాడు.
Hanuman Jayanti: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మెగా ఫ్యామిలీ లో తనకంటూ భారీ ఫ్యాన్స్ బేస్ ను క్రియేట్ చేసుకొని తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్నాడు. వచ్చిన సినిమాలన్నీ చేయకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు ఈ మగధీరుడు. ఇటీవలే జక్కన్న చెక్కిన ఆర్ఆర్ఆర్(RRR)లో అల్లూరిగా అలరించి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు శంకర్ సినిమా కోసం సెట్ లో కష్టపడుతున్నాడు చరణ్. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే చరణ్ కు జంతువులు అంటే ఎనలేని ఇష్టమన్న విషయం చాలా మందికి తెలుసు. ఆయన దగ్గర ఇప్పటికే రకరకాల జంతువులు ఉన్నాయి. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పవనపుత్రుడు ఆంజనేయుడు మెగాస్టార్ చిరంజీవి ఇష్టం దైవం అన్న విషయం అందరికి తెలిసిందే. ఆ ఇష్టంతోనే చరణ్ కు రామ్ చరణ్ తేజ్ అనే పేరుపెట్టారు. మెగాస్టార్ ప్రతీ ఏడాది హనుమంతుడి ప్రతి వేడుకని ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా రామ్ చరణ్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్లో భాగంగా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో మేకప్ వేసుకుంటుండగా..అక్కడికి ఓ కోతి వచ్చింది. దాన్ని చూసిన చరణ్ బీస్కెట్లు ఇచ్చాడు. చరణ్ ఇచ్చిన బిస్కెట్స్ ను ఆ కోతి తింటూ అక్కడే కూర్చుంది. ఈ వీడియోకి శ్రీ ఆంజనేయం..ప్రసన్న ఆంజనేయం సాంగ్ ని సింక్ చేసి దాన్ని చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో పై మెగా అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :