Andhra Pradesh: తిరుపతిలో మరణ మృదంగం.. ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలు..

Tirupati maternity hospital: ఆంధ్రప్రదేశ్‌లో శిశు మరణాలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వరుసగా పసిబిడ్డలు మరణించడంపై తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Andhra Pradesh: తిరుపతిలో మరణ మృదంగం.. ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలు..
Child
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 16, 2022 | 11:41 AM

Tirupati maternity hospital: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న శిశు మరణాలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వరుసగా పసిబిడ్డలు మరణించడంపై తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రసూతి ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందంటూ పలువురు పేర్కొంటున్నారు. ఒక్కరు, ఇద్దరు కాదు..తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో ఏకంగా 14మంది పసిబిడ్డలు మృతి చెందారు. వారం రోజుల్లో 14మంది మృత్యువాత పడటంపై కుటుంబ సంక్షేమ శాఖ సీరియస్‌ అయింది. ప్రస్తుతం శిశు మరణాలపై విచారణ జరుపుతోంది.

మరోవైపు రుయా (ruia hospital tirupati) చిన్నపిల్లల ఆస్పత్రిలోనూ శిశు మరణాలు కొనసాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కుటుంబ సంక్షేమ శాఖ. నిన్న ఓ పసికందు మృతి చెందడంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బిడ్డ చనిపోయిందంటూ ఆందోళనలకు దిగారు భాదితులు. ఈ ఘటనపై ఇవాళ కమీషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ అనిల్ విచారించనున్నారు.

కాగా.. వరుసగా శిశువుల మరణాలపై బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఆసుపత్రుల ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Also Read:

“అమ్మా”నుషం.. ఎంత పని చేశావమ్మా.. అనుమానాలు రేపుతున్న బావిలో మృతదేహం

vontimitta: ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవం.. ఫోటో గ్యాలెరీ