AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirit: డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాటను సందీప్ రెడ్డి వంగా నిలబెట్టుకుంటాడా?

గత ఏడాది నుంచి ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాత ‘స్పిరిట్’ స్టార్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. సందీప్-ప్రభాస్ కాంబో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఈ ఆలస్యం నిరాశకు గురిచేస్తోంది.

Spirit: డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాటను సందీప్ రెడ్డి వంగా నిలబెట్టుకుంటాడా?
Prabhas & Sandeep Reddy Vanga
Nikhil
|

Updated on: Nov 14, 2025 | 9:21 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న కాప్ డ్రామా ‘స్పిరిట్’. నాలుగేళ్లుగా వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి రాలేదు. ‘యానిమల్’ తర్వాత షూటింగ్ మొదలవుతుందని ప్రకటించినప్పటికీ ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది.

గత ఏడాది నుంచి ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాత ‘స్పిరిట్’ స్టార్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. సందీప్-ప్రభాస్ కాంబో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఈ ఆలస్యం నిరాశకు గురిచేస్తోంది.

అయితే, తాజాగా ఆ సినిమాపై సందీప్ రెడ్డి వంగా బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. హైదరాబాద్‌లో జరిగిన ‘జిగిరి’ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఈ నెలాఖరు నుంచి ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ మొదలవుతుందని తెలిపాడు వంగా. అయితే, హను రాఘవపూడి దర్శకత్వంలో వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన షూటింగ్ పెండింగ్‌లోనే ఉంది. ఇక, ‘ది రాజాసాబ్’ షూటింగ్ దాదాపు పూర్తయినా, ‘స్పిరిట్’కు డేట్స్ ఇవ్వాలంటే ప్రభాస్ రెండు చిత్రాలకు రెండు డిఫరెంట్ లుక్స్ మేనేజ్ చేయాలి.

Spirit

Spirit

‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్ర ఇప్పటివరకు చేసినవాటికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీనికి తగ్గట్టు మానసికంగా, శారీరకంగా కూడా సిద్దం కావాలి. అందుకే సందీప్ చేసిన ప్రకటన నిజమవుతుందా? లేదా? అనేది ప్రస్తుతానికి చెప్పలేం. ఇప్పుడు షూటింగ్ మొదలుకాకపోతే వచ్చే ఏడాది వరకు స్పిరిట్ సినిమా అప్‌డేట్స్‌ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూడాల్సిందే మరి.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చేసిన ‘స్పిరిట్’ సౌండ్ లాంచ్ భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ ఎక్స్‌ప్లోసివ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోనని డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us
జీమెయిల్ ఐడీ మార్చుకోవచ్చు.. గూగుల్ స్టన్నింగ్ ఫీచర్
జీమెయిల్ ఐడీ మార్చుకోవచ్చు.. గూగుల్ స్టన్నింగ్ ఫీచర్
వాటి చూస్తేనే ఉలిక్కిపడుతున్న యూనివర్సిటీ విద్యార్థులు!
వాటి చూస్తేనే ఉలిక్కిపడుతున్న యూనివర్సిటీ విద్యార్థులు!
హీరోయిన్‌తో రొమాన్స్ సీన్స్ లేకపోయేసరికి ఆ హీరోకు డౌట్ వచ్చింది..
హీరోయిన్‌తో రొమాన్స్ సీన్స్ లేకపోయేసరికి ఆ హీరోకు డౌట్ వచ్చింది..
ఐదు భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న లేడీ సూపర్ స్టార్
ఐదు భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న లేడీ సూపర్ స్టార్
నీ ముఖానికి బంగారు గొలుసు వేసుకునేంత సీన్‌ ఉందా..!
నీ ముఖానికి బంగారు గొలుసు వేసుకునేంత సీన్‌ ఉందా..!
‘మావిగన్’.. రాజధానికి వైఎస్ జగన్ ప్లాన్‌ బీ ప్రతిపాదన..
‘మావిగన్’.. రాజధానికి వైఎస్ జగన్ ప్లాన్‌ బీ ప్రతిపాదన..
ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకుని పని చేస్తే అంత డేంజరా..?
ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకుని పని చేస్తే అంత డేంజరా..?
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. హెల్మెట్ లేకంటే ఆ గ్రామల్లోకి నోఎంట్రీ
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. హెల్మెట్ లేకంటే ఆ గ్రామల్లోకి నోఎంట్రీ
ఆ స్టార్ డైరెక్టర్ వడ్డీలే నెలకు రూ. 50 లక్షలు కట్టేవాడు..
ఆ స్టార్ డైరెక్టర్ వడ్డీలే నెలకు రూ. 50 లక్షలు కట్టేవాడు..
సిమ్యులేషన్ ఆధారిత వైద్య విద్యకు సరికొత్త గ్లోబల్ ప్రమాణం
సిమ్యులేషన్ ఆధారిత వైద్య విద్యకు సరికొత్త గ్లోబల్ ప్రమాణం