AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anirudh-Kavya: యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌‌తో డేటింగ్‌లో కావ్య మారన్.. సోషల్ మీడియాలో మొదలైన రచ్చ

గ్రే స్వెట్‌షర్ట్, వైట్ పఫర్ జాకెట్‌లో అనిరుధ్, సాధారణ దుస్తుల్లో కావ్య కలిసి మాట్లాడుతూ నడుచుకుని వెళుతున్నట్టు కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ రిలేషన్‌షిప్ గురించి ఊహాగానాలకు తెరలేపారు. ఈ ఏడాది జూన్‌లోనే అనిరుధ్, కావ్య పెళ్లి చేసుకోబోతున్నారని

Anirudh-Kavya: యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌‌తో డేటింగ్‌లో కావ్య మారన్.. సోషల్ మీడియాలో మొదలైన రచ్చ
Anirudh & Kavya Maran
Nikhil
|

Updated on: Nov 14, 2025 | 8:51 AM

Share

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ డేటింగ్ రూమర్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల న్యూయార్క్ సిటీలో వీరిద్దరూ కనిపించడంతో సోషల్ మీడియాలో మళ్లీ రచ్చ మొదలైంది. ఒక యూకే వ్లాగర్ తన NYC టూర్ వీడియోలో అనిరుధ్, కావ్య నడుస్తున్న వీడియోను రికార్డ్ చేశాడు.

గ్రే స్వెట్‌షర్ట్, వైట్ పఫర్ జాకెట్‌లో అనిరుధ్, సాధారణ దుస్తుల్లో కావ్య కలిసి మాట్లాడుతూ నడుచుకుని వెళుతున్నట్టు కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ రిలేషన్‌షిప్ గురించి ఊహాగానాలకు తెరలేపారు. ఈ ఏడాది జూన్‌లోనే అనిరుధ్, కావ్య పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది.

అనిరుధ్ ఒక సంవత్సరం పైగా కావ్యతో డేటింగ్‌లో ఉన్నాడని, రజినీకాంత్ (అనిరుధ్ మామ) కావ్య తండ్రి కళానిధి మారన్‌తో మాట్లాడినట్టు కూడా జరిపారని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే అనిరుధ్ మాత్రం అవన్నీ కేవలం రూమర్స్ అని Xలో పోస్ట్ పెట్టాడు. ‘పెళ్లా? లాల్.. చిల్ అవుట్ గైస్. రూమర్స్ ఆపండి’ అని స్పష్టం చేశాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) CEOగా ఉన్నారు కావ్య మారన్. సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కుమార్తె. IPL మ్యాచ్‌ల సమయంలో ఆమె అప్పీల్ ఎక్కువ. అనిరుధ్ సన్ పిక్చర్స్ సినిమాలకు (జవాన్, జన నాయగన్) సంగీతం అందిస్తున్నాడు. SRH యాంథమ్‌కు కూడా ఆయనే మ్యూజిక్ అందించాడని టాక్. ఈ వృత్తిపరమైన సంబంధమే వారిని తరచూ కలిసి కనిపించేలా చేస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అనిరుధ్.. దళపతి విజయ్ ‘జన నాయగన్’ నుంచి ‘తలపతి కచేరి’ సింగిల్ విడుదల చేశాడు. ఈ పాటను విజయ్, అరివు పాడగా, లాస్ట్ మినిట్ డాన్స్ నంబర్ 2026 జనవరి 9 రిలీజ్‌కు రిజర్వ్ చేశారు. అలాగే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, షారుఖ్ ‘కింగ్’, రజినీ ‘జైలర్ 2’, నాని ‘ది పారడైస్’ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు అనిరుధ్. తాజాగా వచ్చిన రూమర్స్‌పై వీరిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. దీని గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో