విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ‘సోలో బ్రతుకే సో బెట‌ర్’.. మొదటి వారం కలెక్షన్లు ఎంతో తెలుసా?

క్రిస్మస్ సందర్భంగా విడుదలైన 'సోలో బ్రతుకే సో బెట‌ర్' విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. లాక్‌డౌన్ తర్వాత నేరుగా

విజయవంతంగా ప్రదర్శించబడుతున్న  'సోలో బ్రతుకే సో బెట‌ర్'.. మొదటి వారం కలెక్షన్లు ఎంతో తెలుసా?
Follow us

|

Updated on: Dec 28, 2020 | 2:51 PM

క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెట‌ర్’ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. లాక్‌డౌన్ తర్వాత నేరుగా థియేటర్లలలో విడుదలైన మొదటి చిత్రం. అయితే ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో ప్రదర్శించబడుతోంది. తాజా అప్ డేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌లో తొలి వారాంతంలో రూ.10.08 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు టాక్‌. 50 శాతం ఆక్యుపెన్సీతో 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ కలెక్షన్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. థియేట‌ర్లకు జ‌నాల రాక పెరిగితే ఈ కలెక్షన్లు మ‌రింత బాగా పెరిగే అవకాశమున్నట్లు తెలిసిపోతుంది.

లాక్‌డౌన్ కు ముందు విడుద‌లైన ప్రతి రోజు పండ‌గే చిత్రం వసూళ్లకు, సాయిధ‌ర‌మ్ తేజ్ తాజా మూవీ కలెక్షన్లకు దాదాపు స‌మానంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. అంటే సాధార‌ణ ప‌రిస్థితులున్నపుడు విడుద‌లైన ప్రతిరోజు పండ‌గే సినిమాతో పోలిస్తే కేవ‌లం 3 రోజుల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో ఇంత‌మొత్తంలో కలెక్షన్లు రాబట్టడం సినిమాపై ఉన్న పాజిటివ్ రెస్పాన్స్‌ను తెలియ‌జేస్తుంది. ఏది ఏమైనా లాక్‌డౌన్ తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం కేవలం సాయిధ‌ర‌మ్ తేజ్‌కే చెల్లింది.