దయచేసి శబరిమలను వదిలేయండి: మహిళలకు ఏసుదాసు విన్నపం
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ప్రముఖ సింగర్ ఏసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దయచేసి మహిళలు శబరిమలకు వెళ్లడం మానుకోవాలని ఆయన కోరారు. మహిళల ప్రవేశం వలన దీక్షలో ఉన్న స్వాముల నిగ్రహం దెబ్బతింటుంది. గతంలో అయ్యప్ప స్వాములు మహిళల ముఖం కూడా చూసేవాళ్లు కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎవరైనా మహిళ శబరిమలకు వెళ్తే దీక్షలో ఉన్న భక్తులకు చెడు భావన కలిగే అవకాశం ఉంది. వారి ఆలోచనలు మారతాయి. అందుకే శబరిమలకు వెళ్లొద్దని మహిళలను […]
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ప్రముఖ సింగర్ ఏసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దయచేసి మహిళలు శబరిమలకు వెళ్లడం మానుకోవాలని ఆయన కోరారు. మహిళల ప్రవేశం వలన దీక్షలో ఉన్న స్వాముల నిగ్రహం దెబ్బతింటుంది. గతంలో అయ్యప్ప స్వాములు మహిళల ముఖం కూడా చూసేవాళ్లు కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎవరైనా మహిళ శబరిమలకు వెళ్తే దీక్షలో ఉన్న భక్తులకు చెడు భావన కలిగే అవకాశం ఉంది. వారి ఆలోచనలు మారతాయి. అందుకే శబరిమలకు వెళ్లొద్దని మహిళలను వేడుకుంటున్నా. మహిళలు వెళ్లేందుకు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కానీ అయ్యప్ప భక్తుల దీక్షను భగ్నం చేయొద్దు అని ఏసుదాస్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
అయితే గతంలోనూ పలుమార్లు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఏసుదాసు. 2014లో గాంధీ జయంతి సందర్భంగా ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో మాట్లాడిన ఏసుదాసు.. మహిళలు జీన్స్ వేసుకొని పురుషులకు ఇబ్బంది కలిగించకండి. “సంప్రదాయమైన వస్త్రాలు ధరించండి. అబ్బాయిల్లా ప్రవర్తించకండి” అన్నారు. దీనిపై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. అంతేకాదు గతేడాది సెల్ఫీలపై కామెంట్లు చేసిన ఆయన.. సెల్ఫీల పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు భుజాలను తడుముకుంటున్నారు. అది సంప్రదాయం కాదు అంటూ కామెంట్లు చేశారు. దీనిపై కూడా ఆయన పలు విమర్శలు ఎదుర్కొన్నారు.