గాన కోకిలకు.. నేషనల్ అవార్డ్..!
ప్రముఖ సుప్రసిద్ధ గాయాని, గాన కోకిల పీ సుశీలను.. ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల నేషనల్ అవార్డు వరించింది. సుశీల.. సినీ పాటలే కాకుండా.. పలు భక్తి గీతాలు కూడా పాడారు. ఆమె గానం వింటూంటే.. కోకిలే వచ్చి పాడిందా అన్నంత తీయగా వుంటుంది. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఆమె పాటలు పాడారు. ఇప్పటికే ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మ భూషణ్, సర్వాలయ ఏసుదాస్ పురస్కారాలు వచ్చాయి. కాగా.. ఇది సుశీలకి నాలుగో […]
ప్రముఖ సుప్రసిద్ధ గాయాని, గాన కోకిల పీ సుశీలను.. ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల నేషనల్ అవార్డు వరించింది. సుశీల.. సినీ పాటలే కాకుండా.. పలు భక్తి గీతాలు కూడా పాడారు. ఆమె గానం వింటూంటే.. కోకిలే వచ్చి పాడిందా అన్నంత తీయగా వుంటుంది. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఆమె పాటలు పాడారు. ఇప్పటికే ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మ భూషణ్, సర్వాలయ ఏసుదాస్ పురస్కారాలు వచ్చాయి. కాగా.. ఇది సుశీలకి నాలుగో పురస్కారం. అలాగే.. సుశీలకు ‘గాన సరస్వతీ’, ‘గాన కోకిల’ అనే బిరుదులు కూడా ఉన్నావు.
కాగా.. వైజాగ్ కళాభారతి ఆడిటోరియంలో నేడు జరిగే.. కొప్పరపు కవుల కళాపీఠం 17వ వార్షికోత్సవంలో.. అతిరథ మహారథుల చేతుల మీదుగా.. ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి, సాంస్కృతిక శాఖా మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, బీజేపీ నేత మురళీధర రావు తదితరులు హాజరుకానున్నారు.