గ్రాండ్‌గా సినీ మహోత్సవం..! ఒక్కొక్కరు అదిరిపోయారు..

గ్రాండ్‌గా సినీ మహోత్సవం..! ఒక్కొక్కరు అదిరిపోయారు..

ఒక హీరోనో లేక ఇద్దరి హీరోలని, హీరోయిన్స్‌ని.. ఒకే స్టేజ్‌పై చూస్తే.. వావ్ అని నోరెళ్లబెడతాం.. అలాంటిది.. టాలీవుడ్‌లోని హీరోలందరూ.. ఒకే చోట ప్రత్యక్షమయితే.. కన్నుల పండుగే కదా..! ఇక అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. అదిగో.. ఆ హీరోయిన్ ఇలా వుంది.. ఈ హీరో ఇలా ఉన్నాడంటూ.. చర్చ మొదలు పెడతారు. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ స్థాపించి.. ఇప్పటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా… ఆదివారం రాత్రి.. హైదరాబాద్‌లో.. సినీ దిగ్గజాలంతా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 09, 2019 | 7:49 AM

ఒక హీరోనో లేక ఇద్దరి హీరోలని, హీరోయిన్స్‌ని.. ఒకే స్టేజ్‌పై చూస్తే.. వావ్ అని నోరెళ్లబెడతాం.. అలాంటిది.. టాలీవుడ్‌లోని హీరోలందరూ.. ఒకే చోట ప్రత్యక్షమయితే.. కన్నుల పండుగే కదా..! ఇక అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. అదిగో.. ఆ హీరోయిన్ ఇలా వుంది.. ఈ హీరో ఇలా ఉన్నాడంటూ.. చర్చ మొదలు పెడతారు.

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ స్థాపించి.. ఇప్పటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా… ఆదివారం రాత్రి.. హైదరాబాద్‌లో.. సినీ దిగ్గజాలంతా ఒకే వేదికపైకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో.. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సహా పలువరు నేతలు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అలాగే.. పలువురు సినీ ప్రముఖులకు అవార్డులను బహుమతి చేశారు.

కాగా.. ఈ సినీ మహోత్సవంలో.. సూపర్ స్టార్ క్రిష్ణ, అలాగే.. మెగాస్టార్, జయప్రద, జయసుధ, సుమలత, రాజశేఖర్, డైరెక్టర్ రాఘవేంద్ర రావు.. పలువురు నిర్మాతలు, డైరెక్టర్స్, సింగర్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా.. మెగాస్టార్‌కి 60 వచ్చిన ఛాయలే కనిపించలేదు. ఆయన ఇంకా 30లలో ఉన్నట్టుగా చాలా యంగ్‌గా కనిపించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu