మీకో షాకింగ్ న్యూస్.. మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నా: సింగర్ మోనాలి

మూడేళ్ల క్రితమే తనకు పెళ్లి అయ్యిందని సంచలన విషయాన్ని బయటపెట్టారు ప్రముఖ బాలీవుడ్‌ సింగర్ మోనాలి ఠాకూర్.

మీకో షాకింగ్ న్యూస్.. మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నా: సింగర్ మోనాలి

మూడేళ్ల క్రితమే తనకు పెళ్లి అయ్యిందని సంచలన విషయాన్ని బయటపెట్టారు ప్రముఖ బాలీవుడ్‌ సింగర్ మోనాలి ఠాకూర్. స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక రెస్టారెంట్‌ యజమాని మైక్‌ రిచ్టేను 2017లో పెళ్లి చేసుకున్నట్లు తాజాగా ఆమె వెల్లడించారు. తామిద్దరం సంప్రదాయ వివాహం చేసుకోనందున ఈ విషయాన్ని ఇంతవరకు బయటకు చెప్పలేదని మోనాలి అన్నారు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు.

”నా పెళ్లి విషయం చాలా మందికి షాక్‌కు గురిచేయొచ్చు. ఎందుకంటే నా వివాహానికి నా సన్నిహితులను కూడా పిలవలేదు. ఇప్పటికీ ఇండస్ట్రీలోని చాలా మందికి నాకు పెళ్లైన విషయం తెలీదు. మా వివాహానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇద్దామని అనుకునే లోపలే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ విషయం తెలిసిన నా సన్నిహితులు చాలా మంది కచ్చితంగా అప్‌సెట్ అవుతారు. నా మీద ఇప్పుడు చాలా మందికి కోపం కలగొచ్చు. అయితే మేము ఓ ఫంక్షన్ పెట్టి వారిని పిలిస్తే ఆ కోపం తగ్గిపోవచ్చేమో” అని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఫంక్షన్ నిర్వహించడం కష్టమని ఆమె అన్నారు.

ఇక తన భర్త మైక్‌ గురించి చెప్పిన మోనాలి.. ”స్విట్జర్లాండ్‌కు ఓ ట్రిప్‌కి వెళ్లినప్పుడు మైక్‌ని కలిశాను. అతడితో నేను త్వరగా కలిసిపోయాను. మైక్‌తో మాత్రమే కాదు అతడి కుటుంబంతో కూడా నేను త్వరగా కలిశాను. నన్ను మొదటిసారి మైక్‌ ఎక్కడ కలిశారో అక్కడే ప్రపోజ్ చేశారు. 2016 క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో ఓ చెట్టు కింద నాకు ప్రేమ విషయం చెప్పారు. నేను వెంటనే ఓకే చెప్పా” అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం మైక్‌ కుటుంబంతో స్విట్జర్లాండ్‌లో ఉంటున్న మోనాలి అక్కడే క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక మోనాలి ఇటీవల దిల్ కా ఫితూర్‌ అనే పాటను విడుదల చేయగా.. అందులో మైక్‌ కూడా ఉండటం విశేషం.

Read This Story Also: అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా..!