ఆగష్టు మొదటి వారంలో ఏకధాటిగా హీరో గోపీచంద్ మూవీ షూటింగ్..
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం `సీటీమార్`. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో నిర్మించబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరంలో మొదలైన ఈ సినిమా లాక్ డౌన్‌కి...

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం `సీటీమార్`. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో నిర్మించబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరంలో మొదలైన ఈ సినిమా లాక్ డౌన్‌కి ముందే మూడు షెడ్యూల్స్‌లో 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
మిగిలిన భాగాన్ని ఆగస్ట్ మొదటివారం నుండి షూటింగ్ మొదలుపెట్టి ఒకే షెడ్యూల్‌లో సినిమాని కంప్లీట్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్దమవుతుంది. ఎంతగానో ఎదురు చూస్తున్న గోపిచంద్ అభిమానుల కోసం వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకులముందుకు తీసుకొస్తామని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. జూన్ 12 ఎగ్రెసివ్ స్టార్ గోపిచంద్ బర్త్ డే సందర్భంగా `సీటీమార్` టీమ్ శుభాకాంక్షలు తెలిపి న్యూ స్టిల్ విడుదల చేసింది.
కాగా ఆంధ్రా కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపిచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా ఈ సినిమాలో నటిస్తున్నారు. విలేజ్‌లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్రత్యేక పాత్రలో మరో హీరోయిన్ దిగంగన నటిస్తుండగా చాలా ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, ప్రముఖ నటి భూమిక, రెహమాన్, బాలివుడ్ యాక్టర్ తరుణ్ అరోరా నటిస్తున్నారు.
మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో ఒక పాట మినహా ఇప్పటికే నాలుగు బ్లాక్ బస్టర్ పాటలు రికార్డ్ చేయడం జరిగింది. మాస్ ప్రేక్షకుల కోసం ఒక మాస్ ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేస్తున్నారు మణిశర్మ. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫి ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండబోతుంది.
Read more: కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రముఖ బాలీవుడ్ నటి అపార్ట్‌మెంట్



