Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆగిన వంశీ మూవీ..?

ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు'తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు నెలల గ్యాప్ తరువాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆగిన వంశీ మూవీ..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 23, 2020 | 11:40 AM

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు నెలల గ్యాప్ తరువాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని ఆయన ప్రకటించారు. అయితే ఫిలింనగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఆగిపోయిందట. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా స్క్రిప్ట్ పని పూర్తి అవ్వకపోగా.. ఈ లోపే మరో దర్శకుడు లైన్‌లోకి వచ్చినట్లు సమాచారం.

గీత గోవిందంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న పరశురామ్‌కు మహేష్ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం మేలో గానీ జూన్‌లో గానీ సెట్స్ మీదకు వెళ్లనుందట. అంతేకాదు దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి సినిమాను మహేష్ హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం. అయితే 2018లో గీత గోవిందంతో హిట్ కొట్టిన పరశురామ్.. ఆ తరువాత ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్నారు. కానీ ఈ మధ్యనే నాగ చైతన్యతో ఓ సినిమాను కూడా ప్రకటించారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే ఈ లోపే మహేష్‌తో సినిమా అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే.