Samantha: అభిమానికి వార్నింగ్ ఇచ్చిన సమంత.. ఎందుకంటే..!

ఎప్పుడూ నవ్వుతూ కూల్‌గా ఉండే సమంతకు ఒక్కసారిగా కోపం వచ్చింది. దీంతో అభిమానికి వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అభిమానికి ఆమె వార్నింగ్ ఇవ్వడానికి గల అసలు కారణమేంటంటే..!

Samantha: అభిమానికి వార్నింగ్ ఇచ్చిన సమంత.. ఎందుకంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 12:21 PM

Samantha Akkineni: ఎప్పుడూ నవ్వుతూ కూల్‌గా ఉండే సమంతకు ఒక్కసారిగా కోపం వచ్చింది. దీంతో అభిమానికి వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అభిమానికి ఆమె వార్నింగ్ ఇవ్వడానికి గల అసలు కారణమేంటంటే..!

అప్పుడప్పుడు తిరుమలకు వెళ్లే అలవాటున్న సమంత.. ఇటీవల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆమెతో ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీనికి కాస్త ఇబ్బందికి ఫీల్ అయిన సమంత.. ఆ తరువాత ఫ్యాన్స్ కోరిక మేరకు కొంతమందితో ఫొటోలు తీసుకుంది. ఆ తరువాత ఓ వ్యక్తి.. సమంత ఎక్కడికి వెళ్తే అక్కడ వీడియో తీస్తూ ఉండటం.. ఆమె గమనించింది. దీంతో తన సహనాన్ని కోల్పోయి.. ఫొటోలు తీయకండి అంటూ సున్నితంగానే వార్నింగ్ ఇచ్చింది. అయితే సినీ ప్రముఖులకు ఇలాంటి ఘటనలు ఎదురవ్వడం సాధారణంగా చూస్తూనే ఉంటాం.

కాగా ఈ నెల ప్రారంభంలో జాను మూవీతో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 96రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత నటన ఆకట్టుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఆమె తమిళ్‌లో విజయ్ సేతుపతి సరసన కాతు వాకుల రెండు కాదల్ అనే చిత్రానికి ఓకే చెప్పింది. విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో నయనతార కూడా నటించనుంది. అలాగే అశ్విన్ శరవణన్ తెరకెక్కిస్తోన్న చిత్రంలోనూ సమంత నటించబోతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఎన్టీఆర్ 30వ సినిమాలోనూ సమంత ఓ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.