Toll Charge: వాహనదారులకు కేంద్రం భారీ ఊరట.. టోల్ ఫీజు 25 శాతం తగ్గింపు.. ఫిబ్రవరి 15 నుంచే..
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఊరట కలిగించింది. ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్ ఫీజును తగ్గించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. పాక్షికంగా ప్రారంభమైన రోడ్లు, నిర్మాణంలో ఉన్న రోడ్లకు ఇవి వర్తించనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ఫీజులకు సంబంధించి వాహదారులకు ఊరట కలిగిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్‌వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును తగ్గించనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని వెల్లడించింది. టోల్ ఫీజును దాదాపు 25 శాతం తగ్గించాలని నిర్ణయించింది. దీంతో వాహనదారులకు భారీ ఊరట కలగినట్లయిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు పనులు పూర్తి కాని ఎక్స్‌ప్రెస్‌వేలపై కూడా ప్రయాణికుల నుంచి అధిక టోల్ ఛార్జీలు నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. దీనిలో మార్పులు చేస్తూ తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.
టోల్ ఫీజు నియమాల్లో మార్పులు
ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్ ఫీజుల విషయంలో నిబంధనలను కేంద్రం సవరించింది. ఇప్పటివరకు ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి కాకపోయినా లేదా పాక్షికంగా పూర్తి అయిన వాటిపై కూడా టోల్ ఫీజు వసూలు చేస్తున్నాయి. దీని వల్ల ప్రయాణికులకు నష్టం జరుగుతందనే ఉద్దేశంతో టోల్ ఫీజును తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక నుంచి ఈ టోల్ ఫీజు తగ్గింపు అనేది శాశ్వతంగా ఉండదని తెలుస్తోంది. రోడ్డు నిర్మాణ పనులు పూర్తైన తర్వాత సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నారు. కొత్తగా నిర్మించే ఎక్స్‌ప్రెస్‌వేలను ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. టోల్ ఫీజు తక్కువగా ఉంటే ఎక్కువమంది రోడ్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల జాతీయ రహదారులపై కూడా ట్రాఫిక్ తగ్గుతుందని కేంద్రం భావించింది. అందులో భాగంగానే ఈ తగ్గింపును ప్రకటించినట్లు తెలుస్తోంది.
2008లో వచ్చిన నియమాల్లో మార్పులు
టోల్ ఫీజును తగ్గించేందుకు జాతీయ రహదారుల ఫీజు నిబంధనల్లో మార్పులు చేశారు. 2008లో ఈ నియమాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నియమాలను మార్చి ఇప్పుడు టోల్ ఫీజు తగ్గించారు. ఈ టోల్ తగ్గింపు ఏడాది పాటి అమల్లో ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం పూర్తయ్యే వరకు ఇది అమల్లో్కి ఉంటుంది. దీంతో వాహనదారులు ఈ నిర్ణయంతో బెనిఫిట్ జరగనుంది.
