CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ భారత్‌కు వరుస స్వర్ణాలు.. బాక్సింగ్‌లో మెరిసిన ఇద్దరు వీర వనితలు!
కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ స్వర్ణ పతకం సాధించిన కొద్ది నిమిషాల్లోనే, 57 కేజీల కేటగిరీలో ప్రపంచ నంబర్ 1 బాక్సర్ జైస్మిన్ లాంబోరియా భారత్‌కు మరో చిరస్మరణీయమైన స్వర్ణ పతకాన్ని అందించారు.దీంతో భారత్ ఖాతాలో మొత్తం 7 స్వర్ణాలు చేరాయి.

భారత యువ బాక్సింగ్ సంచలనం, క్రీడాకారిణి ప్రీతి పవార్ అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటింది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ మహిళల 54 కేజీల విభాగంలో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నాను మట్టికలిపించి బాక్సింగ్‌తో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని తెచ్చి పెట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచి అద్భుతమైన ఆట తీరు, సమయస్పూర్తితో రాణించిన ప్రతి ప్రత్యర్థి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 5-0 డామినేట్ చేసి మరీ విజయాన్ని సాధిచంది.
ప్రతి మొదటి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై పంఛ్‌ల వర్షాన్ని కురిపించడం స్టార్ట్ చేసింది. సమయస్పూర్తితో అవసరమైన చోట కచ్చితమైన పంచ్‌లు విసురుతూ మ్యాచ్ గమనాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఆమె దాడికి ముగ్ధులైన ఐదుగురు న్యాయనిర్ణేతలు మొదటి రౌండ్‌లో ప్రీతికి అనుకూలంగా 10-8 స్కోరు ఇచ్చారు. ఇక రెండో రౌండ్‌లోనూ అదే ఊపును కొనసాగించిన ఆమె.. ప్రత్యర్థిపై ఫై చేయి సాధింస్తూ చిరవకు జయకేతనం ఎగరవేసింది. భారతదేశపు అగ్రశ్రేణి బాక్సర్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న ప్రీతికి ఈ పతకం మరో కీలక మైలురాయిగా మారనుంది.
57 కేజీట కేటగిరీలో భారత్‌కు మరో స్వర్ణం
ఇదిలా ఉండగా ఇదే మహిళల బాక్సింగ్‌లో భారత్‌కు ఇంకో స్వర్ణం కూడా లభించింది. మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్‌కు మరో బంగారు పతకం లభిచంది. ఫైనల్ బౌట్‌లో జైస్మిన్ నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన సీనియర్ బాక్సర్ మికేలా వాల్ష్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచే జైస్మిన్ తన ఎత్తు, సుదీర్ఘ రీచ్‌ను అనుకూలంగా మార్చుకుని పోటీపై పూర్తి నియంత్రణ సాధించారు. ప్రత్యర్థి మికేలా వాల్ష్ నుంచి తనదైన రీతిలో తప్పించుకుంటూ కచ్చితమైన పంచ్‌లతో జైస్మీత్ ఎదురుదాడి చేస్తూ జడ్జీలను ఆకట్టుకున్నారు. జైస్మిత్ సైతం ప్రతి తరహాలోనే ప్ర్యతర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని చూపించి 5-0తో జయకేతనం ఎగురవేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
