AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోచ్ కావాలంటూ లింక్డిన్‌లో పాక్ ఓపెన్ పోస్ట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్ల వర్షం!

సాధారణంగా ఏ బోర్డ్ అయినా కోచ్‌ల నియామకం కోసం తమ అధికారిక వెబ్‌సైట్లలో నోటిఫికేషన్లు ఇస్తుంటుంది. కానీ పీసీబీ మాత్రం ఏకంగా ప్రొఫెషనల్స్ వాడే లింక్డిన్ యాప్‌లో జాబ్ పోస్ట్ పెట్టింది. కార్పొరేట్ ఉద్యోగాల మాదిరిగా క్రికెట్ కోచ్ పోస్టుకు లింక్డిన్ లో ప్రకటన ఇవ్వడంతో సోషల్ మీడియాలో దీనిపై తెగ ట్రోల్స్ నడుస్తున్నాయి. 

కోచ్ కావాలంటూ లింక్డిన్‌లో పాక్ ఓపెన్ పోస్ట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్ల వర్షం!
Pakistan Posts Coach Vacancy On Linkedin
Sharada V
|

Updated on: Sep 03, 2026 | 3:13 PM

Share

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి సోషల్ మీడియాలో నవ్వులపాలైంది. జట్టులో ఫీల్డింగ్ స్థాయి పూర్తిగా పడిపోవడంతో, ఇటీవలే వైదొలిగిన ఫీల్డింగ్ కోచ్ షేన్ మెక్‌డెర్మాట్ స్థానాన్ని భర్తీ చేసేందుకు పీసీబీ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే, దీనికోసం వారు ఎంచుకున్న విధానమే అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా బోర్డులు తమ వెబ్‌సైట్లలో కోచ్‌ల కోసం దరఖాస్తులు కోరుతుంటాయి, కానీ పీసీబీ మాత్రం ఏకంగా కార్పొరేట్ ఉద్యోగాలు వెతుక్కునే లింక్‌డిన్‌ యాప్‌లో జాబ్ పోస్ట్ పెట్టింది.

క్రికెట్ జాతీయ జట్టు కోచ్ పోస్టును కూడా కార్పొరేట్ ఉద్యోగంలా లింక్‌డిన్‌లో ప్రకటన ఇవ్వడంతో నెటిజన్లు దీనిపై విపరీతంగా సెటైర్లు పేలుస్తున్నారు. పాక్ ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్‌ను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. “క్యాచ్‌లు వదిలేయడంలో పీహెచ్‌డీ చేసిన అనుభవం ఉండాలా?” అని కొందరు ప్రశ్నిస్తే, “ఈ ఉద్యోగానికి ఎంపికైతే సెలవుల్లో నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందా?” అంటూ మరికొందరు సెటైర్లు పేల్చుతున్నారు. ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్‌లో పీసీబీ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది.

“కోచ్‌లను వెతకడానికి లింక్‌డిన్‌ వాడుతున్నారా?”, “పాకిస్థాన్ బోర్డు మనకు ఫ్రీగా వినోదం పంచడానికే పుట్టింది”, “వీళ్ల తీరు ఎప్పటికీ మారదు” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. పీసీబీ వింతగా కోచ్‌ను ఎంపిక చేస్తున్న తీరు చూసి నెటిజన్లు మీమ్స్ పోస్ట్ చేసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

పాకిస్థాన్ పురుషుల సీనియర్‌ జట్టులో అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్ల ఫీల్డింగ్‌ను మెరుగుపరిచే బాధ్యత కొత్తగా నియమితులయ్యే కోచ్‌దేనని పీసీబీ వెల్లడించింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి కనీసం లెవల్-2 క్రికెట్ కోచింగ్ సర్టిఫికెట్‌తో పాటు, కోచింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉండాలని నిబంధనలు పెట్టింది. అంతేకాకుండా, స్టార్ ఆటగాళ్లు, జాతీయ జట్లు లేదా ఐపీఎల్ లాంటి పెద్ద లీగ్ జట్లతో పనిచేసిన అనుభవం కూడా కచ్చితంగా ఉండాలని స్పష్టం చేసింది.

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు ఘోరంగా ఓడిపోవడంతో, పీసీబీ బోర్డు ప్రక్షాళన చర్యల్లో భాగంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ప్రక్షాళనలో భాగంగానే ఏడుగురు సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడంతో పాటు, కోచింగ్ స్టాఫ్, సెలక్షన్‌ కమిటీలోనూ భారీ మార్పులు చేసింది. కొత్త ఫీల్డింగ్ కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 9వ తేదీ తుది గడువుగా పీసీబీ ఖరారు చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు పీసీబీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని బోర్డు కోరింది

Follow Us