కీలక గ్రహాల అనుగ్రహం.. ఆ రాశుల వారికి కొత్త పెట్టబడులకు బెస్ట్ టైమ్ ఇదే..!
సెప్టెంబర్ 7 నుంచి 26 వరకు బుధుడు తన ఉచ్ఛ క్షేత్రమైన కన్యా రాశిలో సంచరించనున్నాడు. అదే సమయంలో గురువు కర్కాటకంలో ఉచ్ఛస్థితిలో, శుక్రుడు తులా రాశిలో స్వస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక విషయాల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారు వ్యాపారం ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు చేపట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చు.

జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు వ్యాపారాలు, మదుపులు, పెట్టుబడులు, ప్రణాళికలు, వ్యూహాలు, బ్యాంకులు, షేర్లు, స్పెక్యులేషన్లకు కారకుడు. ఈ నెల (సెప్టెంబర్) 7వ తేదీ నుంచి 26 వరకు బుధ గ్రహం తన ఉచ్ఛ క్షేత్రమైన కన్యా రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ కారకత్వాలు కొన్ని రాశులకు బాగా కలిసివచ్చే అవకాశం ఉంది. బుధుడి ఉచ్ఛ స్థితికి తోడు, గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేస్తుండడం వల్ల వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారు వ్యాపార రంగంలో ప్రవేశించడానికి, షేర్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.
వృషభం
ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఎంత పెట్టుబడి పెట్టినా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇంతకంటే అనుకూల సమయం మరొకటి ఉండదు. ఉద్యోగులు కూడా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. షేర్లు, స్టాకులు కొనడం వల్ల తప్పకుండా అంచనాల్ని మించి లబ్ధి పొందుతారు. భూములు, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా అపార ధన లాభాలు కలుగుతాయి.
మిథునం
ఈ రాశికి అధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉండబోతున్నందువల్ల స్థిరా స్తులు, రియల్ ఎస్టేట్ రంగం మీద పెట్టుబడులు పెట్టడం మంచిది. షేర్లు కూడా అపారంగా లాభి స్తాయి. ఎక్కడ మదుపులు, పెట్టుబడులు పెట్టినా లాభాలు కలుగుతాయి. వడ్డీ వ్యాపారాలు లాభాల వర్షం కురిపిస్తాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యు లేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా లాభిస్తాయి.
సింహం
ఈ రాశికి ధన, లాభాధిపతి అయిన బుధుడు ధన స్థానంలో ఉచ్ఛ పడుతున్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఏ విధంగా మదుపు చేసినా వీరికి లాభాల పంట పండుతుంది. భాగస్వామ్య వ్యాపారాల వల్ల బాగా కలిసి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించి ధన లాభాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. రియల్ ఎస్టేట్ ధనవర్షం కురిపిస్తుంది.
కన్య
రాశ్యధిపతి బుధుడు ఈ రాశిలో ఉచ్ఛస్థితికి వస్తున్నందువల్ల ఈ రాశివారు కూడా మదుపులు, పెట్టుబడులు, వ్యాపారాల ద్వారా ఉచ్ఛస్థితికి రావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం పెరగడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కూడా బాగా లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబ డులు కలిసి వస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే వీరు ఖాయంగా విజయాలు సాధిస్తారు.
వృశ్చికం
ఈ రాశికి లాభ స్థానంలో ఉచ్ఛ బుధుడి సంచారం వల్ల ఈ రాశివారు వ్యాపారాలు, పెట్టుబడులు, షేర్ల ద్వారా అతి తక్కువ కాలంలో కోటీశ్వరు లయ్యే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు, పెట్టే పెట్టుబడులు తప్ప కుండా కనక వర్షం కురిపిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తుల ద్వారా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా ఆర్థిక లాభాలనిస్తాయి.
మకరం
ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారికి ఆస్తి పాస్తుల మీదా, రియల్ ఎస్టేట్ మీదా పెట్టే పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. తక్కువ స్థాయిలో పెట్టుబడులు పెట్టినా అపార ధన లాభం కలుగుతుంది. ఇతరులతో కలిసి వ్యాపారాలు చేయడం వల్ల లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, బంగారం, భూమి, లాటరీల మీద పెట్టుబడులు పెట్టి ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. అదనపు ఆదాయం అత్యధికంగా పెరుగుతుంది.



