AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇటీవలే తమిళ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తమిళ చిత్రం ‘జైలర్‌’లో ఆయన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తర్వాత పెద్ది సినిమాలో నటించి మెప్పించారు.

ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్
Shivaraj Kumar
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2026 | 10:03 AM

Share

కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ హీరో శివరాజ్ కుమార్ మరోసారి తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకున్నారు. సాధారణంగా యాక్షన్, కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే ఆయన.. ఇటీవల ఓ కుటుంబ కథా చిత్రం చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారట. సినిమా పూర్తయిన తర్వాత చాలాసేపు ఆ భావోద్వేగం నుంచి బయటపడలేకపోయానని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన బెయిల్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల తాను చూసిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మూవీ తనను ఎంతో కదిలించిందని తెలిపారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చూసిన తర్వాత తనకు ఎదురైన అనుభూతిని శివరాజ్ కుమార్ వివరిస్తూ.. సినిమా పూర్తయిన అనంతరం దాదాపు గంటసేపు నిద్ర పట్టలేదని చెప్పారు. కొన్ని సన్నివేశాలు తన కళ్లలో నీళ్లు తెప్పించాయని వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలో కనిపించిన కుటుంబ బంధాలు, భావోద్వేగ సన్నివేశాలు తన సొంత కుటుంబాన్ని గుర్తుచేశాయని తెలిపారు.

వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

తన తల్లిదండ్రులు, దివంగత నటుడు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మతో పాటు కుటుంబ సభ్యుల జ్ఞాపకాలు ఒక్కసారిగా తన కళ్ల ముందు కదిలాయని శివరాజ్ కుమార్ పేర్కొన్నారు. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హృదయాన్ని తాకేలా మంచి కుటుంబ కథా చిత్రంలో నటించాలని తనకు కూడా కోరిక కలిగిందని చెప్పారు. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినప్పటికీ.. తమిళనాడులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదనే టాక్ వినిపించింది. ఆ తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే, ఈ చిత్రాన్ని చూసిన శివరాజ్ కుమార్ మాత్రం తాను తీవ్రంగా భావోద్వేగానికి గురైనట్లు చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మహేష్ బాబు, ప్రభాస్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే

ఇక శివరాజ్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కన్నడలో తనకు ఉన్న స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూనే ఇతర భాషల్లోనూ కీలక పాత్రలు చేస్తూ దక్షిణాది ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు. ఇటీవల తెలుగులో తెరకెక్కిన పెద్ది చిత్రంలో ఆయన కీలక పాత్రలో కనిపించారు. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన  జైలర్ 2 లోనూ అతిథి పాత్రలో మెప్పించనున్నట్లు సమాచారం. తమిళంలో పికాసో, తెలుగులో గుమ్మడి నర్సయ్య, కన్నడలో డాడ్, 666 ఆపరేషన్ డ్రీమ్ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్‌ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us