Oke Oka Jeevitham: ‘ఒకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
థియేటర్లలో మంచి విజయం అందుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి..
శర్వానంద్, రీతూవర్మ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కించిన తాజాగా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని అమల, నాజర్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు.
బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ‘ఒకే ఒక జీవితం’.. అటు వసూళ్లు పరంగా కూడా బ్రేక్ ఈవెన్ చేరుకుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ సినిమాతో పోటీపడిన శర్వానంద్ మూవీ.. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. మరి థియేటర్లలో మంచి విజయం అందుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చేసింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘ఒకే ఒక జీవితం’ చిత్రాన్ని దీపావళీ కానుకగా అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. థియేటర్‌లో విడుదలైన సరిగ్గా 6 వారాలకు చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది.
జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన “ఒకే ఒక జీవితం” ఈ నెల 20 నుండి మీ సోనీ LIV లో#OkeOkaJeevithamOnSonyLIV #SonyLIV #OkeOkaJeevitham@imsharwanand @riturv @amalaakkineni1 @vennelakishore @priyadarshi_i @twittshrees pic.twitter.com/BcnFUI2Ccd
— SonyLIV (@SonyLIV) October 10, 2022