మరోసారి ‘అర్జున్ రెడ్డి’ జోడి..!

టాలీవుడ్ సెన్సేషన్ గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ తన మార్కెట్ ను విస్తరించే పనిలో పడ్డాడు. అందులో భాగంగా ప్రస్తుతం చేసే సినిమాలన్నీ కూడా బహు భాష చిత్రాలుగా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘డియర్  కామ్రేడ్’ నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా విజయ్ హీరోగా తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఓ ట్రై లింగ్యువల్ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో […]

మరోసారి 'అర్జున్ రెడ్డి' జోడి..!
Ravi Kiran

|

May 11, 2019 | 11:40 AM

టాలీవుడ్ సెన్సేషన్ గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ తన మార్కెట్ ను విస్తరించే పనిలో పడ్డాడు. అందులో భాగంగా ప్రస్తుతం చేసే సినిమాలన్నీ కూడా బహు భాష చిత్రాలుగా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘డియర్  కామ్రేడ్’ నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా విజయ్ హీరోగా తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఓ ట్రై లింగ్యువల్ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు.  ఇక ఇందులో ఓ హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. కాగా తాజా సమాచారం ప్రకారం మరో కథానాయకి పాత్ర కోసం అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే ను ఖరారు చేశారు. అర్జున్‌ రెడ్డి సినిమాతో హిట్ కాంబినేషన్‌ అనిపించుకున్న విజయ్‌, షాలినిల జోడి మరోసారి తెర మీదకు వస్తుండటంతో ఫిలిం నగర్‌లో ఇది హాట్ టాపిక్‌ అయ్యింది

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu