విశాల్ పెళ్లికి డేట్ ఫిక్స్..!

కొద్దిరోజుల క్రితం తమిళ హీరో విశాల్, నటి అనిషా అల్లాకు నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ పెద్దలు హాజరయ్యారు. ఇది ఇలా ఉంటే వీరిద్దరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్లు ఓ వార్త కోలీవుడ్ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం విశాల్ పెళ్ళికి అక్టోబర్ 9న ముహూర్తం కుదిరిందని అంటున్నారు. తమిళ నడిగర్‌ సంఘం బిల్డింగ్‌ పనులు పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని […]

విశాల్ పెళ్లికి డేట్ ఫిక్స్..!
Follow us
Ravi Kiran

|

Updated on: May 11, 2019 | 12:02 PM

కొద్దిరోజుల క్రితం తమిళ హీరో విశాల్, నటి అనిషా అల్లాకు నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ పెద్దలు హాజరయ్యారు. ఇది ఇలా ఉంటే వీరిద్దరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్లు ఓ వార్త కోలీవుడ్ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం విశాల్ పెళ్ళికి అక్టోబర్ 9న ముహూర్తం కుదిరిందని అంటున్నారు. తమిళ నడిగర్‌ సంఘం బిల్డింగ్‌ పనులు పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్‌ ఆ మధ్య ప్రకటించారు. మరో నాలుగైదు నెలల్లో బిల్డింగ్‌ పనులు కూడా పూర్తి కానుండడంతో విశాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన విశాల్ చేస్తాడని సన్నిహితులు చెబుతున్నారు.