Viral Video: ఫెరారీలో షారుఖ్.. ఈ కారు ఖరీదు ఎన్నికోట్లో తెలుసా?
రాధికా మర్చంట్ తో తమ కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుండటంతో అంబానీ దంపతులు సంబురాలు చేసుకుంటున్నారు. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా, మార్చి 6న కూడా బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ వంటి స్టార్స్ హాజరయ్యారు.

రాధికా మర్చంట్ తో తమ కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుండటంతో అంబానీ దంపతులు సంబురాలు చేసుకుంటున్నారు. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా, మార్చి 6న కూడా బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ వంటి స్టార్స్ హాజరయ్యారు. మూడు రోజుల అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో, షారుక్ స్టేజ్ పై డ్యాన్స్ చేశాడు, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి ఇతర బాలీవుడ్ స్టార్స్ కూడ సందడి చేశాడు. సంగీత్ తారల సందడిగా సాగగా, షారుక్ రాక వేడుకలకు మరింత గ్లామర్ ఉత్సాహాన్ని పెంచింది.
గుజరాత్ లోని జామ్ నగర్ లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత షారుఖ్ ఖాన్ ఫెరారీ పురోసాంగ్ ఎస్ యూవీలో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ఈ వీడియో బాగా పాపులర్ అయ్యి జనాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అభిమానుల్లో క్యూరియాసిటీని రేకెత్తించింది.
ఈ కార్యక్రమంలో షారుక్ కోసం ఫెరారీ పురోసాంగ్ ను ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారతదేశపు అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఈ కారును కలిగి ఉన్నారు. విలాసవంతమైన జీవనశైలికి పేరుగాంచిన అంబానీ కుటుంబానికి ఇప్పటికే ఫెరారీల కార్లు ఉన్నాయి. అయితే దీని విలువరూ 10.5 కోట్లు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Shah Rukh Khan returning from Jamnagar in a Ferrari 🔥😎#ShahRukhKhan #AnantRadhikaPreWeddingpic.twitter.com/OZCwhE3Emt
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) March 6, 2024