Actress Aamani: మెగాస్టార్ చిరంజీవితో నటించే ఆఫర్‌ను రిజెక్ట్ చేశా.. కారణమిదేనంటూ చెప్పుకొచ్చిన సీనియర్ నటి..
Actress Aamani: ఏ నటి అయినా.. నటుడికైనా మెగాస్టార్ చిరంజీవితో నటించే ఆఫర్ వస్తే ఏగిరి గంతేసి ఓకే చెబుతారనడం..

Actress Aamani: ఏ నటి అయినా.. నటుడికైనా మెగాస్టార్ చిరంజీవితో నటించే ఆఫర్ వస్తే ఏగిరి గంతేసి ఓకే చెబుతారనడం ఎలాంటి సందేహం. అయితే, ఓ సీనియర్ నటి మాత్రం అప్పట్లో చిరంజీవితో నటించే అవకాశం వస్తే నిర్ద్వందంగా తోసిపుచ్చారట. తాను నటించనని కుండబద్దలు కొట్టారట. మరి అంత స్ట్రాంగ్‌గా సినిమాను రిజెక్ట్ చేయడానికి కారణమేంటి? అది ఏ సినిమా? ఆసినిమాలో ఆమె క్యారేక్టర్ ఏంటి? అసలు విషయంలోకి వెళ్దాం పదండి.
తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసనగా హీరోయిన్‌గా నటించి మెప్పించారు నటి ఆమని. తన నటనాభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారవిడ. తెలుగునాట అక్కినేని నాగేశ్వరరావు మొదలు, నాగార్జున, నందమూరి బాలకృష్ణ, సుమన్, నరేష్, జగపతి బాబు వంటి ప్రముఖ హీరోల సరసన నటించారు. నటి సౌందర్యతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఆమని.. ఒక్క మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించలేకపోయారు. ఆ బాధ ఆమెను ఇప్పటికే వెంటాడుతూనే ఉందట.
తాజాగా నటి ఆమని టీవీ9కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో నటించలేకపోవడంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మెగాస్టార్‌తో నటించలేదనే బెంగ తనకు ఉండేదని, అయితే ఒకసారి తనకు చిరుతో నటించే అవకాశం వచ్చిందని చెప్పిన ఆమని.. ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేశానని అన్నారు. దానికి కారణం.. ఆ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించమని కోరటమేనట. మెగాస్టార్‌ని చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ బోయ్ లా భావించానని, అలాంటిది చిరుకి సోదరిగా తాను నటించడం కుదరని పని అని, ఆ కారణంగానే ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేశానని ఆమని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆయనతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆమని తెలిపారు.
Also read:
Myntra to Change Logo : మహిళ ఇచ్చిన షాక్‌తో లోగోనే మార్చేసుకున్న ఈ-కామర్స్ దిగ్గజం




