Netflix: నెట్‌ఫ్లిక్స్‌కు అడిక్ట్‌ అవుతున్నారా..? అయితే ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించండి..

New Feature In Netflix: స్మార్ట్‌ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చాక ఓటీటీ సేవలు బాగా పాపులర్‌ అవుతున్నాయి. చిన్నారులు, పెద్దలు ఇలా అందరినీ ఆకర్షించేలా కంటెంట్‌ను రూపొందించడంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది...

Netflix: నెట్‌ఫ్లిక్స్‌కు అడిక్ట్‌ అవుతున్నారా..? అయితే ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించండి..
Netflix
Follow us

|

Updated on: Jan 30, 2021 | 8:32 PM

New Feature In Netflix: స్మార్ట్‌ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చాక ఓటీటీ సేవలు బాగా పాపులర్‌ అవుతున్నాయి. చిన్నారులు, పెద్దలు ఇలా అందరినీ ఆకర్షించేలా కంటెంట్‌ను రూపొందించడంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. దీంతో గంటల తరబడి స్మార్ట్‌ ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఒక వెబ్‌ సిరీస్‌ ఓపెన్‌ చేసి.. ఒక ఎపిసోడ్‌ తర్వాత మరోటి ఇలా మొత్తం వెబ్‌ సిరీస్‌ను ఒకే రాత్రిలో చూసేస్తుంటారు కొందరు. ఇలా చేయడం వల్ల నిద్ర పాడవడంతో పాటు కళ్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై నెట్‌ఫ్లిక్స్‌ను యాక్సెస్‌ చేసే సమయంలో సెట్‌ చేసుకున్న సమయానికి స్ట్రీమింగ్‌ ఆగిపోయేలా చేసుకునే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘స్లీప్‌ టైమర్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ద్వారా వినియోగదారులు 15,30,45 నిమిషాలు లేదా సినిమా/షో పూర్తయ్యేవరకు సమయం సెట్‌ చేసుకోవచ్చు. దీంతో సెట్‌ చేసిన సమయానికి స్ట్రీమింగ్‌ ఆగిపోతుంది. ముఖ్యంగా చిన్నారులను కంట్రోల్‌ చేయడానికి ఈ ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత టీవీలు, ల్యాప్‌టాప్‌, ఇతర గ్యాడ్జెట్లలోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read:Actress Aamani: మెగాస్టార్ చిరంజీవితో నటించే ఆఫర్‌ను రిజెక్ట్ చేశా.. కారణమిదేనంటూ చెప్పుకొచ్చిన సీనియర్ నటి..

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు