Actress Aamani: హీరో అక్కినేని అఖిల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీనియర్ నటి ఆమని..
Actress Aamani: ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కి తెలుగు సినీ చరిత్రలో నేటికి చెరగని ముద్ర వేసుకున్న ‘జంబలకిడి పంబ’..

Actress Aamani: ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కి తెలుగు సినీ చరిత్రలో నేటికి చెరగని ముద్ర వేసుకున్న ‘జంబలకిడి పంబ’ సినిమాతో నటి ఆమని తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తరువాత ఆమని వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస ఆఫర్లు ఆమెను వరించాయి. తెలుగు, తమిళ నాట ప్రముఖ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుంది. అప్పట్లో నటి సౌందర్య, ఆమని పేర్లే చిత్రసీమలో ప్రధానంగా వినిపించేయంటే ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగునాట మెగాస్టార్ చిరంజీవితో తప్ప.. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, బాలకృష్ణ, సుమన్, నరేష్, ఎందరో ప్రముఖ నటులతో కలిసి నటించింది.
ఆమని నటించిన సినిమాలు చాలానే ఉన్నప్పటకీ.. ఆమని పేరు ప్రస్తావిస్తే ప్రేక్షకులకు టక్కున గుర్తుచ్చే సినిమాల్లో జంబలకిడి పంబ, శుభలగ్నం, సిసింద్రి ప్రధనంగా చెప్పుకొచ్చు. తాజాగా టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అక్కినేని కుటుంబంలో నాగేశ్వరరావు మొదలు.. నాగార్జున, అఖిల్‌తోనూ నటించిన ఆమని.. ‘సిసింద్రి’ సినిమాలో సిసింద్రి(అఖిల్)కి తల్లిగా నటించిన విషయం తెలిసిందే. అక్కినేని అఖిల్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో మనందరికీ తెలిసిందే. హీరోగా తొలి అడుగులు వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయితే, నాటి సిసింద్రి మొదలు.. నేటి అఖిల్ గా ఎదిగే వరకు ఇద్దరి మధ్య బంధం ఎలా ఉండేదనే దానిపై ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పారు ఆమని. అఖిల్ ఇప్పటికీ తనను ‘అమ్మా’ అనే పిలుస్తాడట. తాను కనబడితే చాలు అమ్మా అంటూ అఖిల్ తన వద్దకు వస్తాడని చెబుతూ ఆమని సంబరపడిపోయారు. ఆ సినిమాలో నటించడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కాగా, అక్కినేని అఖిల్ హీరోగా తెరక్కతున్న మోస్ట్ ఎలిజిబుల్ సినిమాలో ఆమని అఖిల్‌కు తల్లిగా నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.
Also read:



