AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సత్యదేవ్‌, తమన్నా మూవీ ఆగిపోయిందా..!

సత్యదేవ్‌, తమన్నా హీరోహీరోయిన్లుగా ప్రకటించిన చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. కన్నడలో విజయం సాధించిన 'లవ్ మాక్‌టైల్‌' రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది

సత్యదేవ్‌, తమన్నా మూవీ ఆగిపోయిందా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 30, 2020 | 9:13 AM

Share

Gurthundaa Seethakalam movie: సత్యదేవ్‌, తమన్నా హీరోహీరోయిన్లుగా ప్రకటించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడలో విజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్‌’ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. స్వీయ నిర్మాణంలో నాగశేఖర్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించి జూలైలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అప్పట్లో నాగశేఖర్ ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ పూర్తిగా ఆగిపోయినట్లు తెలుస్తోంది.(కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,531 కొత్త కేసులు.. 6 మరణాలు)

కారణాలు తెలీవు గానీ.. ఈ సినిమాను నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మూవీ యూనిట్ ఇంకా ప్రకటించలేదు. కాగా వరుస విజయాల్లో ఉన్న సత్యదేవ్‌ ఈ మూవీ కోసం ఎక్కువ రెమ్యునరేషన్ అడిగినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. దాంతోనే మూవీ ఆగిపోయినట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా సత్యదేవ్ ప్రస్తుతం మహేష్‌ కోనేరు నిర్మాణంలో తిమ్మరుసులో నటిస్తున్న విషయం తెలిసిందే. (ఈ క్రెడిట్‌ మొత్తం నీదే: మంచు లక్ష్మికి సూర్య థ్యాంక్స్‌)