AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రంగ్ దే’ టీమ్‌కి మళ్లీ ఇబ్బందులు..!

నితిన్‌, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న లవ్‌ ఎంటర్‌టైనర్ రంగ్‌ దే. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో

'రంగ్ దే' టీమ్‌కి మళ్లీ ఇబ్బందులు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 30, 2020 | 11:07 AM

Share

Rang De Shooting: నితిన్‌, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న లవ్‌ ఎంటర్‌టైనర్ రంగ్‌ దే. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో.. ఈ మూవీ కూడా ఆ మధ్యన సెట్స్ మీదకు వెళ్లింది. అంతేకాదు ఓ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు రంగ్‌ దేకి సంబంధించి ఒకే ఒక్క షెడ్యూల్‌ మాత్రమే మిగిలి ఉంది.

అందులో కొన్ని సన్నివేశాలతో పాటు పాటలు ఉన్నాయి. వాటిని ఇటలీలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావించింది. ఇక ఈ షూటింగ్‌ని పూర్తి చేసేందుకు ఈ వారంలోనే ఇటలీకి వెళ్లేందుకు ప్లాన్ చేసింది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్‌ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. (IPl 2020: దినేష్ కార్తీక్‌, అంపైర్‌ మధ్య తెలుగు సంభాషణ.. వీడియో వైరల్‌)

ఇటలీలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వగా.. అక్కడి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. దీంతో రంగ్‌ దే టీమ్‌ ఇటలీ షెడ్యూల్‌ క్యాన్సిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మిగిలిన చిత్రీకరణను దుబాయ్‌లో జరపాలని మూవీ యూనిట్ భావిస్తోందట. అయితే భారత్‌లో కేసుల దృష్ట్యా దుబాయ్ కూడా ఆ మధ్యన పలు ఆంక్షలు విధించింది. ఇలాంటి సమయంలో మరి మిగిలిన ఒకే ఒక్క షెడ్యూల్‌ని రంగ్‌ దే టీమ్‌ ఎక్కడ పూర్తి చేస్తుందో చూడాలి. కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.(ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో)

Follow Us
మారేడు చెట్టు కింద ఈ ఒక్క పని చేస్తే చాలు.. మహా ఐశ్వర్యం! చాగంటి
మారేడు చెట్టు కింద ఈ ఒక్క పని చేస్తే చాలు.. మహా ఐశ్వర్యం! చాగంటి
మే నెలాఖరు వరకు.. సాఫీగా, హ్యాపీగా వారి జీవితం..!
మే నెలాఖరు వరకు.. సాఫీగా, హ్యాపీగా వారి జీవితం..!
వాళ్లిద్దరికీ ఓ పందెం పెట్టా.. అందుకే ఇలా: శ్రేయస్ అయ్యర్
వాళ్లిద్దరికీ ఓ పందెం పెట్టా.. అందుకే ఇలా: శ్రేయస్ అయ్యర్
పనికిరాని విషయంపై గొడవ.. ఒకరి ప్రాణం బలి
పనికిరాని విషయంపై గొడవ.. ఒకరి ప్రాణం బలి
మంచు పర్వతంపై చిన్నారి సాహసం.. వైరల్ అవుతున్న ఫొటోస్
మంచు పర్వతంపై చిన్నారి సాహసం.. వైరల్ అవుతున్న ఫొటోస్
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి
రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా
రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా
నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్
నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్
మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే..
ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే..