ఇది వ్యాపారంకాదు లెక్కలేసుకోవడానికి.. సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ పై సెటైర్లు వేసిన కట్టప్ప
సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అయితే రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అయితే రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది సమర్దిస్తుంటే.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు సత్యరాజ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.
డిసెంబర్ 31వ తేదీన తన రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తానని రజినీకాంత్ తెలిపారు. దాంతో రజిని ఎంట్రీ పై అన్నివర్గాల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో నటుడు సత్యరాజ్ రజినీకాంత్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎక్కడా రజినీకాంత్ పేరు వాడకుండానే విమర్శలు చేసారు సత్యరాజ్. ‘రాజకీయాలు చేయాలంటే వేరే విషయాలు ఆలోచించకూడదు, నమ్మిన సిద్దాంతంతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పని చేయాలి.. అంతేగానీ ప్లాన్ చేసుకొని, లెక్కలు వేసుకొని రాజకీయాలు ఎవరైనా చేస్తారా ? లెక్కలు వేసుకొని చేసేదాన్ని వ్యాపారం అంటరాని గుర్తు పెట్టుకోండి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు సత్యరాజ్.