సమంతా చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్..!

సమంతా చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్..!

విజయ్ సేతుపతి హీరోగా త్యాగరాజన్ కుమారన్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’. ఈ చిత్రంలో సమంతా హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ, ఫహద్ ఫాజిల్, మిస్కిన్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి లేడి గెటప్ లో నటిస్తున్నాడు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా రన్ టైం 2 గంటల 55 నిమిషాలని వినికిడి. […]

Ravi Kiran

| Edited By: Anil kumar poka

Mar 27, 2019 | 4:41 PM

విజయ్ సేతుపతి హీరోగా త్యాగరాజన్ కుమారన్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’. ఈ చిత్రంలో సమంతా హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ, ఫహద్ ఫాజిల్, మిస్కిన్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి లేడి గెటప్ లో నటిస్తున్నాడు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా రన్ టైం 2 గంటల 55 నిమిషాలని వినికిడి.

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ వేశ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న రిలీజ్ కానున్న ఈ చిత్రం అటు తెలుగులో కూడా అదే రోజు విడుదలవుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu