‘మహర్షి’ ఫస్ట్ సింగిల్ పోస్టర్ విడుదల

‘మహర్షి’ ఫస్ట్ సింగిల్ పోస్టర్ విడుదల

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం ‘మహర్షి’. ఈ మూవీ నుంచి ఫస్ట్‌సింగిల్‌ను 29న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్.. దానికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ‘చోటీ చోటీ బాతే’ అంటూ సాగనున్న మొదటి పాటను 29 ఉదయం 9.09గంటలకు విడుదల చేయనన్నట్లు ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఇక మహేశ్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేశ్‌లతో వచ్చిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. #MAHARSHI1stSINGLEonMARCH29th The Musical Journey […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 27, 2019 | 10:14 AM

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం ‘మహర్షి’. ఈ మూవీ నుంచి ఫస్ట్‌సింగిల్‌ను 29న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్.. దానికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ‘చోటీ చోటీ బాతే’ అంటూ సాగనున్న మొదటి పాటను 29 ఉదయం 9.09గంటలకు విడుదల చేయనన్నట్లు ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఇక మహేశ్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేశ్‌లతో వచ్చిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

కాగా మహేశ్ ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా ‘మహర్షి’ తెరకెక్కుతోంది. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వంశీ పైడిపల్లి. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి కాగా.. రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. మిగిలిన పనులను పూర్తి చేసుకొని మే9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu