సమంత..సీక్రెట్ టాటూలో ఆ పేరు ఎవరిదో తెలుసా?

సమంత అక్కినేని…ఇప్పుడు ఈ పేరుకు టాలీవుడ్‌లో సపరేట్ బ్రాండ్ ఉంది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత వరస విజయాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఇటీవలే ఈ భార్యాభర్తలు కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత స్యామ్ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఓ బేబీ’ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే స్టార్ హీరోల రేంజ్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’ రీమేక్‌గా […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:18 pm, Mon, 8 July 19
సమంత..సీక్రెట్ టాటూలో ఆ పేరు ఎవరిదో తెలుసా?

సమంత అక్కినేని…ఇప్పుడు ఈ పేరుకు టాలీవుడ్‌లో సపరేట్ బ్రాండ్ ఉంది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత వరస విజయాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఇటీవలే ఈ భార్యాభర్తలు కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత స్యామ్ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఓ బేబీ’ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే స్టార్ హీరోల రేంజ్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది.

విజయం ఇచ్చిన జోషో లేక నాగ చైతన్య తన లైఫ్‌లోకి వచ్చాక వస్తున్న సక్సెస్‌ల ప్రభావమో తెలియదు కానీ..ఓ సీక్రెట్‌ను తన ఫ్యాన్స్‌తోె పంచుకుంది. ‘ కెరీర్‌లో  బెస్త్ ఫేజ్‌ను గడుపుతున్నాను… ఇన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా దాచిన టాటూను ఫైనల్‌గా చూపించేస్తున్నాను. నా భర్త చైయ్ నా ప్రపంచం’ అంటూ తన భర్త పేరుతో ఉన్న సీక్రెట్ టాటూను రివీల్‌ చేసింది. సమంత ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

 

View this post on Instagram

 

Living my best life …😎… (the only tattoo that I’ve been hiding finally on display 🤪) @chayakkineni my husband my world ❤️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on