చిరుతతో కృతి… ట్రోల్ మొదలైంది మరి !

బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ పాపులర్ అయిన బ్యూటీ గర్ల్ కృతి సనన్ ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకుంది. హాలిడే వెకేషన్ కోసం ఇటీవల జాంబియా వెళ్లిన ఈమె… అక్కడి నేషనల్ పార్కులో ఓ చిరుతపులితో సరదాగా షికారు చేసింది. తన పెంపుడు కుక్కలా ఆ చిరుతతో నడుస్తున్న ఫోటోలను ఆ తరువాత తన ఇన్ స్టా గ్రామ్ లో ఆమె పోస్ట్ చేసింది. అంతే..ట్రోలింగ్ మొదలైంది. హానికరమైన ఆ క్రూర జంతువుతో షికారు చేయడమేమిటని […]

చిరుతతో కృతి... ట్రోల్ మొదలైంది మరి !
Pardhasaradhi Peri

|

Jul 08, 2019 | 5:13 PM

బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ పాపులర్ అయిన బ్యూటీ గర్ల్ కృతి సనన్ ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకుంది. హాలిడే వెకేషన్ కోసం ఇటీవల జాంబియా వెళ్లిన ఈమె… అక్కడి నేషనల్ పార్కులో ఓ చిరుతపులితో సరదాగా షికారు చేసింది. తన పెంపుడు కుక్కలా ఆ చిరుతతో నడుస్తున్న ఫోటోలను ఆ తరువాత తన ఇన్ స్టా గ్రామ్ లో ఆమె పోస్ట్ చేసింది. అంతే..ట్రోలింగ్ మొదలైంది. హానికరమైన ఆ క్రూర జంతువుతో షికారు చేయడమేమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నస్తే.. సాధు జంతువులే నీకు దొరకలేదా తల్లీ అంటూ మరికొందరు ఎద్దేవా చేస్తూ ట్వీట్లు చేశారు. అయితే వీటికి కృతి సనన్ దీటుగానే సమాధానమిచ్చింది. జాంబియా లోని ఈ పార్కులో గల క్రూర జంతువులు మనుషులకు ఎంతో మాలిమి అయ్యాయని, ఇవి హాని చేయవని తెలిసే తాను ఈ చిరుతతో కలిసి వాక్ చేశానని పేర్కొంది. ప్రస్తుతం చేతిలో కొత్త సినిమాలు లేకపోవడంతో.. ఈ తీరిక సమయంలో ఈ అమ్మడు జాంబియా టూరు పెట్టుకుని ఎంజాయ్ చేస్తోంది.

View this post on Instagram

He wanted a selfie!! Couldn’t say no.. 🤷‍♀️🐆🤣 #Zambia

A post shared by Kriti (@kritisanon) on

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu