ఇన్‌స్టా‌లోకి అడుగెట్టిన చెర్రీ

సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు దగ్గరగా ఉండేందుకు ఇప్పటి హీరో హీరోయిన్లు చాలా ఆసక్తిని చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అకౌంట్లు క్రియేట్ చేసుకొని.. అందులో తమకు సంబంధించిన విశేషాలను షేర్ చేస్తుంటారు. అయితే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండే మెగా పవర్‌స్టార్ ఇప్పటివరకు ఫేస్‌బుక్‌ ఖాతాను మాత్రమే వాడుతుండగా.. తాజాగా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ‘రంగస్థలం’లోని తన లుక్‌కు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్న […]

ఇన్‌స్టా‌లోకి అడుగెట్టిన చెర్రీ
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2019 | 4:53 PM

సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు దగ్గరగా ఉండేందుకు ఇప్పటి హీరో హీరోయిన్లు చాలా ఆసక్తిని చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అకౌంట్లు క్రియేట్ చేసుకొని.. అందులో తమకు సంబంధించిన విశేషాలను షేర్ చేస్తుంటారు. అయితే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండే మెగా పవర్‌స్టార్ ఇప్పటివరకు ఫేస్‌బుక్‌ ఖాతాను మాత్రమే వాడుతుండగా.. తాజాగా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ‘రంగస్థలం’లోని తన లుక్‌కు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్న చెర్రీ.. డిస్క్రిప్షన్‌లో యాక్టర్ అని మాత్రమే పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇలా అకౌంట్ ఓపెన్ చేశాడో లేదో.. ఫ్యాన్స్ అలా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం 22.6వేల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. ఆయన మాత్రం ఇంకా ఎవరినీ ఫాలో అవ్వలేదు.

https://www.instagram.com/p/BzpbQsNHFXQ/

కాగా గతేడాది ‘రంగస్థలం’తో కెరీర్‌లోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్ఆర్‌’లో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు చెర్రీ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని ఆయన నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.