న్యూడ్ సీన్లో టెన్షన్ పడ్డా..అమలా పాల్

తన ‘ ఆడై ‘ మూవీలో బ్యూటీ..అమలా పాల్ నటించిన న్యూడ్ సీన్ హాట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం టీజర్ ఇప్పటికే వైరల్ కాగా-8 మిలియన్ వ్యూస్ తో ‘ రచ్ఛ ‘ చేసింది. అమలా పాల్ బోల్డ్ నెస్ కి అంతా ఆశ్చర్యపోతూనే ఆమెని అభినందించారు. కాగా-తానేందుకీ నగ్న సన్నివేశంలో నటించాల్సి వచ్చిందో ఈ అమ్మడు ఇటీవల ఓ డైలీకి ఇఛ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ సమయంలో తానెంతో భావోద్వేగానికి, టెన్షన్ […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 4:21 pm, Mon, 8 July 19
న్యూడ్ సీన్లో టెన్షన్ పడ్డా..అమలా పాల్

తన ‘ ఆడై ‘ మూవీలో బ్యూటీ..అమలా పాల్ నటించిన న్యూడ్ సీన్ హాట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం టీజర్ ఇప్పటికే వైరల్ కాగా-8 మిలియన్ వ్యూస్ తో ‘ రచ్ఛ ‘ చేసింది. అమలా పాల్ బోల్డ్ నెస్ కి అంతా ఆశ్చర్యపోతూనే ఆమెని అభినందించారు. కాగా-తానేందుకీ నగ్న సన్నివేశంలో నటించాల్సి వచ్చిందో ఈ అమ్మడు ఇటీవల ఓ డైలీకి ఇఛ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ సమయంలో తానెంతో భావోద్వేగానికి, టెన్షన్ కి గురయ్యానని, నిజానికి ఆ సన్నివేశంలో ఓ స్పెషల్ కాస్ట్యూమ్ ధరించాలని దర్శకుడు రత్నకుమార్ సూచించారని ఆమె తెలిపింది. అయితే దాని గురించి వర్రీ కావద్దని ఆయనకు చెప్పాను.. షూటింగ్ రోజున చాలా ఎగ్జయిటింగ్ కి గురైన మాట మాత్రం వాస్తవం. సెట్స్ లో ఎంతమంది సిబ్బంది ఉంటారని డైరెక్టర్ ని అడిగాను.. ఆ షూటింగ్ రోజున క్లోజ్డ్ సెట్లో సుమారు 15 మంది ఉన్నారు. నేను వారిని నమ్మలేకపోతే ఆ సన్నివేశం చేసేదాన్నే కాదు.. అని అమలా పాల్ పేర్కొంది. కొంతమంది సినీ మేకర్ల స్పందన తెలిశాక అసలు ఇండస్ట్రీని వదిలి వేయాలనే అనుకున్నానని, అయితే కొన్ని కారణాలతో ఈ మూవీలో నటించడానికి ఒప్పుకున్నానని అమలా పాల్ తెలిపింది. ‘ ఆడై ‘ చిత్రంలో ఇంత ‘ ధైర్యంగా ‘ నటించినందుకు ఈమెను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, అక్కినేని వారి ఇంటికోడలు సమంత ప్రశంలతో ముంచెత్తారు. సమంత ట్వీట్లకు స్పందించిన అమలా పాల్ ఆమెకు ధన్యవాదాలు తెలిపింది.