‘మజిలీ’ని చేరుకున్న ‘ఓ బేబీ’!

హైదరాబాద్: సమంత నటించిన ‘ఓ బేబీ’ సూపర్ హిట్. తెలుగునాటే కాదు అమెరికాలో కూడా దుమ్ము రేపుతోంది ‘ఓ బేబీ’. పెద్ద హీరోల సరసన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘జనతా గ్యారేజ్’, ‘మనం’ వంటి చిత్రాలతో మిలియన్ డాలర్ల రికార్డులను చూసింది సమంత. అయితే సోలో హీరోయిన్‌గా ఆ రికార్డు లేదు. ఇప్పుడు ఓ బేబీతో సమంత.. మిలియన్ డాలర్ రికార్డును టార్గెట్‌గా పెట్టుకుంది. ఆ మార్క్‌కు దగ్గరగా వచ్చింది. రెండో వీకెండ్ ఎండ్ అయ్యేసరికి […]

'మజిలీ'ని చేరుకున్న 'ఓ బేబీ'!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 15, 2019 | 8:06 PM

హైదరాబాద్: సమంత నటించిన ‘ఓ బేబీ’ సూపర్ హిట్. తెలుగునాటే కాదు అమెరికాలో కూడా దుమ్ము రేపుతోంది ‘ఓ బేబీ’. పెద్ద హీరోల సరసన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘జనతా గ్యారేజ్’, ‘మనం’ వంటి చిత్రాలతో మిలియన్ డాలర్ల రికార్డులను చూసింది సమంత. అయితే సోలో హీరోయిన్‌గా ఆ రికార్డు లేదు. ఇప్పుడు ఓ బేబీతో సమంత.. మిలియన్ డాలర్ రికార్డును టార్గెట్‌గా పెట్టుకుంది. ఆ మార్క్‌కు దగ్గరగా వచ్చింది.

రెండో వీకెండ్ ఎండ్ అయ్యేసరికి ‘ఓ బేబీ’ సినిమా అమెరికాలో 8 లక్షల 60 వేల డాలర్లను పొందింది. మరో లక్షా 40 వేల డాలర్లు వస్తే వన్ మిలియన్ మార్క్ దక్కుతుంది. ఆ రేంజ్‌లో ‘ఓ బేబీ’ అమెరికాలో వసూళ్లు అందుకుంటోంది. అయితే ఇప్పటికే తన భర్త నటించిన ‘ప్రేమమ్’ సినిమా వసూళ్లను దాటడమే కాదు.. ఇటీవలే విజయాన్ని అందుకున్న ‘మజిలీ’ వసూళ్లను కూడా దాటేసింది.

నాగచైతన్య సోలో హీరోగా నటించిన సినిమాల్లో ‘ప్రేమమ్’ సినిమా అమెరికాలో అత్యధిక వసూళ్లు పొందింది. ‘ప్రేమమ్’ సినిమా చైతన్యకు అమెరికాలో బిగ్ హిట్. ఆ వసూళ్లను సమంత ‘ఓ బేబీ’తో దాటేసింది. అలా భర్త రికార్డును బ్రేక్ చేసింది సమంత.