అది నేను కొనాల్సింది: షారూక్ ఇంటిపై సల్మాన్

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, కింగ్ ఖాన్ షారూక్ ఖాన్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షారూక్ ఇంటిపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబయిలో షారూక్ ఖాన్ ఉంటోన్న ఇల్లు(మన్నత్‌‌) ఉండగా.. ఇది మొదట సల్మాన్ కొనాలని భావించాడట. అయితే అంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటావని అతడి తండ్రి వారించడంతో సల్లూ భాయ్ ఆగిపోయాడట. ఈ విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సల్మాన్. ఈ సందర్భంగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:42 am, Mon, 27 May 19
అది నేను కొనాల్సింది: షారూక్ ఇంటిపై సల్మాన్

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, కింగ్ ఖాన్ షారూక్ ఖాన్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షారూక్ ఇంటిపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబయిలో షారూక్ ఖాన్ ఉంటోన్న ఇల్లు(మన్నత్‌‌) ఉండగా.. ఇది మొదట సల్మాన్ కొనాలని భావించాడట. అయితే అంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటావని అతడి తండ్రి వారించడంతో సల్లూ భాయ్ ఆగిపోయాడట. ఈ విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సల్మాన్.

ఈ సందర్భంగా అంత పెద్ద ఇంటిని షారూక్ ఏం చేసుకుంటాడో అని తనకు ఎప్పటి నుంచో సందేహం ఉందని సల్మాన్ తెలిపాడు. ఈ విషయం గురించి ఆయనను అడిగి తెలుసుకోవాల్సిందే అంటూ సరదాగా కామెంట్ చేశాడు. కాగా మన్నత్ గురించి ఆ మధ్యన షారూక్ స్పందిస్తూ.. ‘‘నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఢిల్లీ వాళ్లకు బంగ్లాలో ఉండటమే ఇష్టం. కానీ ముంబయిలో అపార్ట్‌మెంట్‌లో ఉండేందుకు ఇష్టపడుతుంటారు. గౌరీతో నా వివాహం అయిన తరువాత ముంబయికి వచ్చినప్పుడు ఆమెతో కలిసి చిన్న ఇంట్లో ఉండేవాడిని. కానీ ఎలాగైనా సొంత ఇల్లు ఉండాలనుకున్న నేను కొన్నేళ్ల తరువాత మన్నత్ గురించి తెలుసుకొని దానిని సొంతం చేసుకున్నా. నా జీవితంలో నేను కొన్న అత్యంత ఖరీదైన భవనం ఇదే’’ అంటూ తెలిపిన విషయం తెలిసిందే. కాగా మన్నత్ విలువ దాదాపు 200కోట్లు ఉంటుంది.