బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో..?
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమ స్థానాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లింది. అసలు ‘కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు..?’ అనే ప్రశ్న అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వీటిపై రకరకాల కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే.. తాజాగా ఈ సినిమాపై సల్లూ భాయ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి. ‘భారత్’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో సల్మాన్ ఖాన్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన మీడియాతో సమావేశమయ్యాడు. ఈ […]

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమ స్థానాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లింది. అసలు ‘కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు..?’ అనే ప్రశ్న అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వీటిపై రకరకాల కామెంట్స్ కూడా వచ్చాయి.
అయితే.. తాజాగా ఈ సినిమాపై సల్లూ భాయ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి. ‘భారత్’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో సల్మాన్ ఖాన్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన మీడియాతో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి సల్మాన్‌కి మీరు బాహుబలి చిత్రాలు చూశారా..? అని ప్రశ్నించగా.. దీనికి సమాధానంగా నేను మొదటి భాగమే చూశానని, అసలు కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని చెప్పగా అందరూ ఒక్కసారిగా నవ్వారు. ‘భారత్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటం వల్ల నేను ‘బాహుబలి’ రెండో భాగం చూడలేకపోయానని సల్మాన్ తెలిపాడు.