AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ లో దూసుకుపోతున్న మలయాళీ భామ.. వరుసగా ఐదు సినిమాల్లో నటిస్తున్న సాయిపల్లవి

ఫిదా' సినిమా తో  తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన భామ సాయిపల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ..

టాలీవుడ్ లో దూసుకుపోతున్న మలయాళీ భామ.. వరుసగా ఐదు సినిమాల్లో నటిస్తున్న సాయిపల్లవి
Rajeev Rayala
|

Updated on: Dec 24, 2020 | 5:13 PM

Share

‘ఫిదా’ సినిమా తో  తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన భామ సాయిపల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతుంది సాయి పల్లవి. నటన తో పాటు డ్యాన్స్ లోను ఈ అమ్మడు ఇరగదీస్తోంది. అవ్వడానికి మలయాళీ ముద్దుగుమ్మే అయినా టాలీవుడ్ లో సాయిపల్లవికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో నటిస్తుంది.

టాలీవుడ్ లో ఇప్పటికే పూజ హెగ్డే, రష్మిక మందన, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ లు సత్త చాటుతున్న సాయి పల్లవిమాత్రం వాళ్ళను వెనక్కి నెట్టేసి ఆఫర్లను అందుకుంటుంది. ఇప్పటికే నాగచైతన్య లవ్ స్టోరీ, రానా విరాటపర్వం తోపాటు నాని సరసన శ్యామ్ సింగ రాయ్ కృష్ణవంశీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. ఇవే కాకుండా.. పవన్-రానా మల్టీస్టారర్ ‘బిల్లా రంగా’లోనూ సాయిపల్లవే హీరోయిన్ అని అంటున్నారు. ఇలా ఐదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ చిన్నది. ఈ సినిమాల్లో ఏ మూడు సినిమాలు హిట్ అయినా సాయిపల్లవి రేంజ్ మారిపోవడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే