సాహో లేడీ విలన్.. “నీలాంబరి” రేంజ్ గురూ!

సాహో లేడీ విలన్.. నీలాంబరి రేంజ్ గురూ!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ సినిమా ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ మూవీకి సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీలోని విలన్ల త్రయం నీల్ నితిన్, చుంకీ పాండే, అరుణ్ విజయ్‌లను పరిచయం చేశారు. తాజాగా ఈ సినిమాలోని లేడి విలన్‌గా నటిస్తున్న మందిరా బేడీకి సంబందించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. […]

Ravi Kiran

|

Aug 09, 2019 | 9:08 PM

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ సినిమా ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ మూవీకి సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీలోని విలన్ల త్రయం నీల్ నితిన్, చుంకీ పాండే, అరుణ్ విజయ్‌లను పరిచయం చేశారు.

తాజాగా ఈ సినిమాలోని లేడి విలన్‌గా నటిస్తున్న మందిరా బేడీకి సంబందించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.  బ్లాక్ డ్రస్‌లో గ్లామర్‌గా, ఫిట్‌గా ఉన్న మందిరా లుక్ అదిరిందని చెప్పాలి. ఈ చిత్రంలో ఆమె కల్కి అనే నెగెటీవ్ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్స్‌ను రేపు విడుదల చేయనున్నారు. దీనితో పాటు కొద్దిసేపటి క్రితం మరో నటి ఎవెలిన్ శర్మకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu